Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
Indian Bank | ఇంటి దొంగను ఈశ్వరుడై పట్టుకోలేడంటే ఇదేనేమో.. బ్యాంకులోని బంగారు అభరణాలను (Gold Ornaments) ఓ అసిస్టెంట్ మేనేజర్ ఎత్తుకెళ్లాడు. జనం సొమ్మును సొంతానికి వాడుకున్నాడు.
Indian Bank | త్రినేత్ర.న్యూస్: ఇంటి దొంగను ఈశ్వరుడై పట్టుకోలేడంటే ఇదేనేమో.. బ్యాంకులోని బంగారు అభరణాలను (Gold Ornaments) ఓ అసిస్టెంట్ మేనేజర్ ఎత్తుకెళ్లాడు. జనం సొమ్మును సొంతానికి వాడుకున్నాడు. నెలవారి తనిఖీల్లో విషయం బయటపడటంతో బ్యాంకు అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో (Indian Bank) చోటుచేసుకున్నది. ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా (Assistant Manager) పనిచేస్తున్న రాజేశ్.. 22 మంది ఖాతాదారులకు చెందిన 700 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసి తన సొంత అవసరాలకు వాడుకున్నాడు.
ప్రతినెల జరిగే బ్యాంక్ మేనేజర్ తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. దీంతో మహబూబాబాద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేశ్ కొట్టేసిన నగల విలువ సుమారు రూ.90 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆడిట్ పూర్తిగా జరిగితే ఇంకా ఎంత బంగారం చోరీకి గురైందనే విషయం తెలిస్తుంది.
తాజావార్తలు
- ●Harish Rao | ఇక్కడ పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్‌కు కరెంటు అమ్ముకుంటరా?
- ●Allu Arjun | గీతా ఆర్ట్స్‌తో సంబంధం లేదు ... సొంత ఆఫీస్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్
- ●Redmi 17C 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ కెమెరాలు.. షియోమీ కొత్త ఫోన్.. రెడ్మీ 17సి 5జి లాంచ్..
- ●Niranjan Reddy | కనీసం పంట రుణాలు కూడా ఇవ్వకపోవడం దారుణం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
- ●Captain Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు గుజరాత్ గరిమా అవార్డు
- ●MP Mallu Ravi | అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ జెన్జీలు : ఎంపీ మల్లు రవి

Harish Rao | ఇక్కడ పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్‌కు కరెంటు అమ్ముకుంటరా?

Allu Arjun | గీతా ఆర్ట్స్‌తో సంబంధం లేదు ... సొంత ఆఫీస్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్

Redmi 17C 5G | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ కెమెరాలు.. షియోమీ కొత్త ఫోన్.. రెడ్మీ 17సి 5జి లాంచ్..

Niranjan Reddy | కనీసం పంట రుణాలు కూడా ఇవ్వకపోవడం దారుణం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి






