Justice Yashwant Varma | అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా
Justice Yashwant Varma | అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని శుక్రవారం రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు.
Justice Yashwant Varma | అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని శుక్రవారం రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. కాగా, గతంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ నివాసంలో కట్టలకొద్దీ నోట్లు బయటపడిన విషయం తెలిసిందే. ఆయన నివాసం స్టోర్ రూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో ఈ విషయం బయటపడింది. ఈ నోట్ల కట్టలపై విచారణ జరుగుతోంది. అదే సమయంలో నోట్ల కట్టల ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని తొలగించేందుకు పార్లమెంట్‌లో అభిశంసనకు ప్రయత్నాలు జరుగుతుండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
కాగా, గతేడాది ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా (Delhi High Court) ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు వచ్చిన సమయంలో పెద్ద మొత్తంలో కాలిపోయిన నోట్ల కట్టలు, సగం కాలిన నోట్లు బయటపడ్డాయి. ఘటన జరిగిన సమయంలో జస్టిస్ వర్మ ఇంట్లో లేరు. ఈ ఘటన తర్వాత జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అంతర్గత దర్యాప్తు కోసం ఆదేశించింది. విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది.
తన అధికారిక నివాసంలో స్వాధీనం చేసుకున్న కాలిపోయిన నగదుపై వివరణ ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారని దర్యాప్తు నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై ఆయనను అభిశంసించవచ్చని నివేదిక పేర్కొంది. జస్టిస్ వర్మ ఇంట్లో లభించిన కాలిపోయిన కరెన్సీ నోట్ల ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది. జస్టిస్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్‌లో దాదాపు 1.5 అడుగుల ఎత్తున కాలిపోయిన కరెన్సీ నోట్ల గుట్ట లభించినట్లు నివేదిక పేర్కొంది.
జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమని కమిటీ తేల్చడంతో.. రాజీనామా చేయాల్సిందిగా జస్టిస్ వర్మకు సీజేఐ సూచించారు. ఆయన తిరస్కరించడంతో.. అభిశంసనకు సిఫారసు చేస్తూ (motion seeking his removal) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి లేఖలు రాశారు. జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని ఇచ్చారు. ఈ రాజీనామాతో అభిశంసన ప్రక్రియ ముగిసిపోతుందని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

Also Read..
సీఎం భార్యపై ఆరోపణలు.. కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట
శాంతి చర్చలపై ప్రతిష్టంభన.. అప్పటి వరకూ అమెరికాతో చర్చలు ఉండవంటూ ఇరాన్ కీలక ప్రకటన
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hijab | ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 25, 2026

Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు
ఆగస్టు 14, 2026

Janhvi Kapoor | అలా అయితే గుహలో ఉండాల్సి వస్తుంది..! జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●DGP Anand | ఎంపీ గారు.. మీపై నిఘా కోసం ఎవరినీ నియమించలే: డీజీపీ సీవీ ఆనంద్
- ●Bitcoin | క్రిప్టో మార్కెట్లలో బుల్ ర్యాలీ.. 80వేల డాలర్లకు చేరిన బిట్‌కాయిన్..
- ●Girlfriend leaves 3,400 kiss marks on car | ప్రియుడి కారుపై ప్రేయసి 3,400 కిస్ సింబల్స్.. వైరల్ కోసం యువకుడి వింత ఆలోచన
- ●Drugs Smuggling | డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్ హోస్టెస్
- ●Shriya Saran | 19 ఏళ్ల తర్వాత తలైవాతో శ్రియా రొమాన్స్ - శివాజీ కాంబో రిపీట్
- ●Lava Virat V1 Pro 5G | లావా నుంచి మరో కొత్త 5జి ఫోన్.. రూ.2వేల లాంచింగ్ డిస్కౌంట్..

DGP Anand | ఎంపీ గారు.. మీపై నిఘా కోసం ఎవరినీ నియమించలే: డీజీపీ సీవీ ఆనంద్

Bitcoin | క్రిప్టో మార్కెట్లలో బుల్ ర్యాలీ.. 80వేల డాలర్లకు చేరిన బిట్‌కాయిన్..

Girlfriend leaves 3,400 kiss marks on car | ప్రియుడి కారుపై ప్రేయసి 3,400 కిస్ సింబల్స్.. వైరల్ కోసం యువకుడి వింత ఆలోచన

Drugs Smuggling | డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్ హోస్టెస్



