Arvind Kejriwal | మమ్మల్ని ఆటపట్టిస్తున్నారా.. కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
Arvind Kejriwal | క్రిమినల్ ధిక్కార కేసుకు (criminal contempt case) సంబంధించి కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం చేస్తుండటంపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్ దాఖలు చేయడానికి మరో మూడు వారాల గడువు ఇచ్చింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. ఇకపై ఎలాంటి పొడిగింపులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ ధిక్కార కేసుకు (criminal contempt case) సంబంధించి కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం చేస్తుండటంపై తీవ్రంగా మందలించింది. అఫిడవిట్ దాఖలు చేయడానికి మరో మూడు వారాల గడువు ఇచ్చింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. ఇకపై ఎలాంటి పొడిగింపులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.
కేసు రికార్డులన్నీ అందించామని రిజిస్ట్రీ నివేదిక ఇచ్చినప్పటికీ, ఇంకా పత్రాలు అందలేదని ఆప్ నేతల తరఫు న్యాయవాదులు పేర్కొనడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. "మీరు మమ్మల్ని ఆటపట్టిస్తున్నారు (You are taking us for a ride). ఇకపై ఎలాంటి పొడిగింపు ఇచ్చేది లేదు" అని కోర్టు స్పష్టం చేసింది. నిర్దేశించిన మూడు వారాల గడువులోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయకపోతే, కౌంటర్ దాఖలు చేసే హక్కును కోల్పోతారని కేజ్రీతోపాటూ మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ సహా పలువురు ఆప్ నేతలను తీవ్రంగా హెచ్చరించింది. అనంతరం కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 27కు వాయిదా వేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi excise policy case) ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు. ఆ సమయంలో న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎడిట్ చేసిన వీడియోలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితర ఆప్ నేతలపై క్రిమినల్ ధిక్కార చర్యలు ప్రారంభించారు. చట్టపరమైన మార్గాలను ఆశ్రయించకుండా అరవింద్ కేజ్రీవాల్ తనపై సోషల్ మీడియాలో వ్యవస్థీకృత ప్రచారంతో బురదజల్లే ప్రయత్నం చేశారని జస్టిస్ శర్మ పేర్కొన్నారు.
Also Read..
సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. న్యాయవాదిపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
దేశాల మధ్య పోటీ కంటే పరస్పర సహకారం ఎంతో అవసరం : ప్రధాని మోదీ
సంబంధిత వార్తలు

Bharat Summit Hyderabad | ‘భారత్ సమ్మిట్’ వేదికగా దేశ వ్యతిరేక శక్తులకు అండ.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్
నవంబర్ 16, 2026

Arvind Kejriwal | రూ.7 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం.. కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు
నవంబర్ 12, 2026

Delhi Air Pollution | ఢిల్లీలో కాలుష్యానికి ఆప్ నేతలు కుట్ర : బీజేపీ మంత్రి
నవంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
- ●Sugar Free Mithai | షుగర్ ఫ్రీ స్వీట్లు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?
- ●TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!
- ●Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
- ●Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Sugar Free Mithai | షుగర్ ఫ్రీ స్వీట్లు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?

TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు



