Pawan Khera | సీఎం భార్యపై ఆరోపణలు.. కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Pawan Khera | కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera)కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఊరట లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) భార్యపై చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో ఖేరాకు అరెస్టు నుంచి వారం రోజుల పాటూ కోర్టు ఊరట కల్పించింది.
Pawan Khera | కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera)కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఊరట లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) భార్యపై చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో ఖేరాకు అరెస్టు నుంచి వారం రోజుల పాటూ కోర్టు ఊరట కల్పించింది. అంతలోపు ముందస్తు బెయిల్ కోసం సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని జస్టిస్ కె.సుజనతో కూడిన బెంచ్ సూచించింది. అయితే, ఖేరా తరఫున న్యాయవాది మరింత సమయం కావాలని కోరగా.. అందుకు కోర్టు నిరాకరించింది.
కాగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ శర్మ (Riniki Bhuyan Sarma)పై పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రిణికి శర్మకు మూడు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని, ఆ సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై సీఎం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖేరాపై గువాహటిలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో గువాహటి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వపన్ ఖేరా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రాజకీయ దురుద్దేశంతోనే అస్సాం పోలీసులు పవన్ ఖేరాపై సంబంధం లేని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఖేరా తరఫున న్యాయవాదులు ధర్మాసనానికి తెలియజేశారు. ఖేరా పట్ల హిమంత ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఇక అస్సాం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ) దేవజిత్ సైకియా వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ఖేరా ఢిల్లీలో శాశ్వత నివాసి అని, ఆయనపై అస్సాంలో కేసు నమోదైతే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఖేరా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణార్హతపై తీర్పు రిజర్వు చేసింది. ఇవాళ ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పింది.
Also Read..
తొడల వద్ద కొవ్వు అధికంగా ఉందా.. ఈ యోగాసనాలు వేయండి..
శాంతి చర్చలపై ప్రతిష్టంభన.. అప్పటి వరకూ అమెరికాతో చర్చలు ఉండవంటూ ఇరాన్ కీలక ప్రకటన
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు.. జనవరి నుంచే వర్తింపు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jairam Ramesh | ఇస్రోను కేంద్రం బలహీనపరుస్తోంది.. జైరామ్ రమేష్
ఆగస్టు 24, 2026

Balmoor Venkat | విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. మీ లడాయి ఎక్కడికి పోయింది?.. బీజేపీ నేతలపై బల్మూర్ వెంకట్ ఆగ్రహం
ఆగస్టు 24, 2026

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
- ●Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం - కానీ ఓ కండీషన్
- ●Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ
- ●RS Praveen Kumar | ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు

TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం - కానీ ఓ కండీషన్



