Pakistan Vs Israel | శాంతి చర్చల వేళ.. ఇజ్రాయెల్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం
Pakistan Vs Israel | పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య నేడు శాంతి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చల వేళ తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్, పాకిస్థాన్ (Pakistan Vs Israel) మధ్య మాటల యుద్ధం నెలకొంది.
International | Published On Apr 10, 2026, 11.49 am IST
Pakistan Vs Israel | పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య నేడు శాంతి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చల వేళ తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్, పాకిస్థాన్ (Pakistan Vs Israel) మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగింది. ఈ వివాదానికి కారణం పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఓ వివాదాస్పద ట్వీటే. ఇజ్రాయెల్ దుష్ట దేశం అని, మానవాళికి శాపం అంటూ ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) తన ట్వీట్‌లో పేర్కొన్నారు. శాంతి చర్చల వేళ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరగుతుండగా.. ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌లో మారణహోమాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. "ఇజ్రాయెల్ ఓ దుష్ట దేశం. మానవాళికి శాపం. ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుండగానే.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగుతోంది. మొదట గాజా, తర్వాత ఇరాన్, ఇప్పుడు లెబనాన్.. ఇలా అమాయక పౌరులను ఇజ్రాయెల్ పొట్టనబెట్టుకుంటోంది. యూరోపియన్ యాదుల నుంచి విముక్తి పొందడానికి పాలస్తీనా భూభాగంపై ఈ క్యాన్సర్ లాంటి దేశాన్ని (ఇజ్రాయెల్‌ను ఉద్దేశిస్తూ) సృష్టించిన వ్యక్తులు నరకంలో కాలిపోవాలని నేను కోరుకుంటున్నాను" అంటూ ఖవాజా ఆసిఫ్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది.
ఇక ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి మాటలను సహించదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం (Prime Minister of Israel) పేర్కొంది. ఈ మేరకు పాక్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇస్లామబాద్ వేదికగా శాంతి చర్చలు జరిపేందుకు నాయకత్వం వహిస్తున్న పాకిస్థాన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని తెలిపింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ కూడా ఖవాజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమ దేశాన్ని క్యాన్సర్‌తో పోల్చడం.. వారి వినాశనానికి పిలుపునివ్వడమేనని హెచ్చరించారు. ఇక తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఖవాజా ఆసిఫ్ తన పోస్టును డిలీట్ చేశారు.
Also Read..
అబద్ధాలకు నేటితో ముగింపు పలకాలి.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మెలానియా ట్రంప్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Khawaja Asif | పీవోకే నిరసనకారులు కూడా భారత్‌లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
జులై 29, 2026

Khawaja Asif | అదే జరిగితే భారత్‌తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
జూన్ 22, 2026

Benjamin Netanyahu | నేను బతికే ఉన్నాను.. అమెరికా రాయబారితో ఇజ్రాయెల్ ప్రధాని ఆసక్తికర సంభాషణ
మార్చి 18, 2026
తాజావార్తలు
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
- ●Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం - కానీ ఓ కండీషన్
- ●Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ
- ●RS Praveen Kumar | ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు

TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం - కానీ ఓ కండీషన్



