Iran | శాంతి చర్చలపై ప్రతిష్టంభన.. అప్పటి వరకూ అమెరికాతో చర్చలు ఉండవంటూ ఇరాన్ కీలక ప్రకటన
Iran | లెబనాన్ (Lebanon) అంశం తేల్చే వరకూ అమెరికాతో చర్చలకు వచ్చేది లేదని ఇరాన్ (Iran) తెగేసి చెప్పింది. లెబజాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఆపేస్తేనే శాంతి చర్చలకు వస్తామంటూ ఇరాన్ మెలికపెట్టింది.
International | Published On Apr 10, 2026, 12.08 pm IST
Iran | పశ్చిమాసియాలో యుద్ధం మరో కీలక మలుపు తిరిగేలా కనిపిస్తోంది. పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. లెబనాన్ (Lebanon) అంశం తేల్చే వరకూ అమెరికాతో చర్చలకు వచ్చేది లేదని ఇరాన్ (Iran) తెగేసి చెప్పింది.
ఇరాన్-అమెరికా దేశాలు రెండు వారాల పాటూ తాత్కాలిక కాల్పుల విమరణ (Ceasefire) అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇరు దేశాలూ అధికారికంగా ప్రకటించాయి కూడా. ఇక ట్రంప్ సీజ్‌ఫైర్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ సైతం స్వాగతించింది. అయితే, ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒప్పందం కుదిరిన తర్వాత లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
సీజ్‌ఫైర్‌లో భాగంగా తన మిత్రదేశాలపై దాడులను ఆపాలని ఇరాన్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లెబనాన్‌పై దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఐడీఎఫ్ దాడులకు నిరసనగా హర్మూజ్ జలసంధిని కూడా మళ్లీ మూసివేసింది. ఇప్పుడు తాజాగా కీలక ప్రకటన చేసింది. శాంతి చర్చలకు పాక్ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన తర్వాత.. లెబజాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఆపేస్తేనే శాంతి చర్చలకు వస్తామంటూ ఇరాన్ మెలికపెట్టింది. దీంతో ఈ చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ వివాదం చివరికి ఎటు వెళ్తుందోన్న ఆందోళనలను వ్యక్తమవుతున్నాయి.
Also Read..
శాంతి చర్చల వేళ.. ఇజ్రాయెల్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం
అబద్ధాలకు నేటితో ముగింపు పలకాలి.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మెలానియా ట్రంప్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
- ●Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం - కానీ ఓ కండీషన్
- ●Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ
- ●RS Praveen Kumar | ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు

TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం - కానీ ఓ కండీషన్






