Delhi High Court | తండ్రి ఇంటిని ఖాళీ చేయాల్సిందే.. కొడుకు, కోడలికి కోర్టు షాక్..!
Delhi High Court | వృద్ధులైన తల్లిదండ్రులు (senior citizen) తమ సొంత ఇళ్లలో కన్నబిడ్డలతో బలవంతంగా కలిసి ఉండాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్పష్టం చేసింది.
Delhi High Court | త్రినేత్ర న్యూస్ : వృద్ధ తల్లిదండ్రుల (senior citizen) హక్కులపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక తీర్పు వెలువరించింది. వృద్ధులైన తల్లిదండ్రులు తమ సొంత ఇళ్లలో కన్నబిడ్డలతో బలవంతంగా కలిసి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 85 ఏళ్ల వృద్ధుడు తన సొంత ఇంటి నుండి తన పెద్ద కుమారుడు, కోడలిని ఖాళీ చేయించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ న్యాయమూర్తి జస్టిస్ అమిత్ మహాజన్ (Justice Amit Mahajan) కీలక ఆదేశాలు జారీ చేశారు.
తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007 కింద తమ పెద్ద కుమారుడు, కోడలిని ఇంటి నుంచి ఖాళీ చేయించడంతో పాటు తనకు భరణం ఇప్పించాలని కోరుతూ 85 ఏళ్ల వృద్ధుడు గతంలో జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. అయితే, వేధింపులు, దుర్వినియోగ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ జిల్లా మేజిస్ట్రేట్ ఆ ఫిర్యాదును క్లోజ్ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 85 ఏళ్ల వృద్ధుడు రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 2008లో తన చిన్న కుమారుడి వివాహం జరిగిన తర్వాత వేరే నివాసం చూసుకోవాలని పెద్ద కుమారుడు, కోడలిని కోరినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, వారు ఇంటిని ఖాళీ చేయడానికి నిరాకరించడమే కాకుండా తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. 2020లో తన భార్య మరణించిన తర్వాత వేధింపులు మరింత తీవ్రమయ్యాయని, తనకు ఆర్థిక సహాయం చేయడం కూడా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అమిత్ మహాజన్ (Justice Amit Mahajan).. వృద్ధ తల్లిదండ్రులు తమ సొంత ఇళ్లలో ప్రశాంతంగా, గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని స్పష్టం చేశారు. సరిగా చూసుకోకపోవడం, వారిని అవమానించడం వంటి పరిస్థితుల్లో తమ సొంత ఇంటి నుంచి పిల్లలు, చట్టపరమైన వారసులను ఖాళీ చేయించే అధికారం వారికి ఉంటుందని తేల్చి చెప్పారు. జిల్లా మేజిస్ట్రేట్ వైఖరిని తప్పుబట్టిన జస్టిస్ మహాజన్.. కుమారుల మధ్య ఉన్న వ్యాపార వివాదాలను కారణంగా చూపి వృద్ధుడి ఆరోపణలను సందేహించడం లేదా చట్టపరమైన రక్షణ నిరాకరించడం సరికాదని పేర్కొన్నారు.
అంతేకాదు, ఇళ్లలో నాలుగు గోడల మధ్య వృద్ధులపై జరిగే వేధింపులకు సాక్ష్యాధారాలు సేకరించడం కష్టమని కోర్టు అభిప్రాయపడింది. తమ ఆస్తి నుంచి పిల్లలను ఖాళీ చేయించాలని కోరే వృద్ధులు, తాము వేధింపులకు గురయ్యామని తప్పనిసరిగా నిరూపించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. కేవలం తమ ఆస్తికి, ప్రశాంత జీవనానికి రక్షణ అవసరమని నిరూపిస్తే సరిపోతుందని తెలిపింది. కోర్టులను, పోలీసులను ఆశ్రయించేంతగా సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, ఇష్టానికి విరుద్ధంగా పిల్లలతో ఇంటిని పంచుకోవాలని వృద్ధ తల్లిదండ్రులను బలవంతం చేయలేమని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు గతంలో వృద్ధుడి అభ్యర్థనను తిరస్కరించిన జిల్లా మెజిస్ట్రేట్, డివిజనల్ కమిషనర్ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. నాలుగు వారాల్లోగా ఆ ఇంటిని ఖాళీ చేయాలని కుమారుడు, కోడలిని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా పిటిషనర్‌కు తగిన రక్షణ కల్పించాలని సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి (SHO) ఆదేశాలు జారీ చేసింది.
Also Read..
రాజీవ్ గాంధీ హత్య కోసం ఉద్దేశపూర్వకంగానే భద్రతను తొలగించారు : సోనియా గాంధీ
మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అసభ్యకర మెసేజ్‌లు.. విజయ్ ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం
ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా టైటిల్‌పై వివాదం - రాజమౌళి కొడుకును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
తాజావార్తలు
- ●Nifty 500, | క్యూ2లో కంపెనీల లాభాలు 32 శాతం జంప్.. మెటల్స్, ఫైనాన్షియల్స్ హవా.. దేశీయ సూచీల దారెటు..?
- ●Fahadh Faasil | ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా టైటిల్‌పై వివాదం - రాజమౌళి కొడుకును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
- ●Sridhar Babu | మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలి
- ●Sonia Gandhi | రాజీవ్ గాంధీ హత్య కోసం ఉద్దేశపూర్వకంగానే భద్రతను తొలగించారు : సోనియా గాంధీ
- ●Reliance Jio | జియో న్యూ ఇయర్ 2027 ఆఫర్.. రూ.399కే అపరిమిత డేటా..
- ●Sai Pallavi | కొడుకుకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చియాన్ విక్రమ్ మూవీ.. హీరోయిన్గా సాయిపల్లవి!

Nifty 500, | క్యూ2లో కంపెనీల లాభాలు 32 శాతం జంప్.. మెటల్స్, ఫైనాన్షియల్స్ హవా.. దేశీయ సూచీల దారెటు..?

Fahadh Faasil | ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా టైటిల్‌పై వివాదం - రాజమౌళి కొడుకును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Sridhar Babu | మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలి

Sonia Gandhi | రాజీవ్ గాంధీ హత్య కోసం ఉద్దేశపూర్వకంగానే భద్రతను తొలగించారు : సోనియా గాంధీ






