CJP | జులై 20 నిరసనలు కేవలం ట్రైలర్ మాత్రమే.. కేంద్రం స్పందించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు : సీజేపీ
CJP | జులై 20 నిరసన (CJP Protest) కేవలం ట్రైలర్ మాత్రమేనని కాక్రోచ్ జనతాపార్టీ (Cockroach Janta Party) స్పష్టం చేసింది. తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. లక్షలాది మంది విద్యార్థులతో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహిస్తామని వార్నింగ్ ఇచ్చింది.
CJP | జులై 20 నిరసన కేవలం ట్రైలర్ మాత్రమేనని కాక్రోచ్ జనతాపార్టీ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. తమ నిరసనలను మరింత తీవ్రస్థాయిలో చేపడతామని స్పష్టం చేసింది. లక్షలాది మంది విద్యార్థులతో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహిస్తామని హెచ్చరించింది.
సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా (Ashutosh Ranka) బుధవారం ఉదయం ఏఎన్ఐతో మాట్లాడారు. ప్రస్తుతం సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలను స్వాతంత్రం తర్వాత భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యమంగా అభివర్ణించారు. తమ ఆందోళనలు పూర్తిగా శాంతియుతంగానే సాగుతున్నాయని స్పష్టం చేశారు. గత 31 రోజులుగా గాంధీ, అంబేడ్కర్ సిద్ధాంతాలను అనుసరిస్తూ శాంతియుత నిరసన కొనసాగిస్తున్నామని చెప్పారు.
సోమవారం సీజేపీ చేపట్టిన చలో పార్లమెంట్ మార్చ్‌ని కూడా విద్యార్థులు శాంతియుతంగానే కొనసాగించినట్లు చెప్పారు. అయితే, ఈ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు బలప్రయోగం చేయడంతోనే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తమ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మరింత భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఎన్‌ఎస్‌ఏ, ఉపా కేసులను కూడా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
#WATCH | Delhi | Cockroach Janta Party (CJP) National Spokesperson Ashutosh Ranka says, "This is the biggest movement in India's post-independence history...We have said this very clearly, what happened on 20th was a trailer. If the Govt doesn't agree, millions more will come to… pic.twitter.com/YwBpgeGkXc
— ANI (@ANI) July 22, 2026
Also Read..
ప్రధాని మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ
మూడో రోజూ అదే పరిస్థితి.. ఉభయసభలు ప్రారంభమైన వెంటనే వాయిదా
సంబంధిత వార్తలు

CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన ‘నీట్’ మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ
జులై 25, 2026

Talasani Srinivas Yadav | జిల్లపురుగులిచ్చిన జవాబ్ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’.. వారికి హ్యాట్సఫ్
జులై 25, 2026

Bandi Sanjay | ముందు దేశం.. ఆ తర్వాతే పార్టీ : కేంద్ర మంత్రి బండి సంజయ్
జులై 25, 2026
తాజావార్తలు
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం

Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..



