త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | వీడియోలు చూసేంత టైమ్ మాకు లేదు.. నిర‌స‌న‌కారుల‌పై పోలీసుల చ‌ర్య‌లో జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాక‌ర‌ణ‌

Supreme Court | కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై (CJP Protesters) పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, పోలీసు చర్యలపై అత్యవసరంగా విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది.

D

National | Published On Jul 22, 2026, 12.22 pm IST

Supreme Court | వీడియోలు చూసేంత టైమ్ మాకు లేదు.. నిర‌స‌న‌కారుల‌పై పోలీసుల చ‌ర్య‌లో జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాక‌ర‌ణ‌
Advertisement

Supreme Court | కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై (CJP Protesters) పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, పోలీసు చర్యలపై అత్యవసరంగా విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ (CJI Surya Kant) నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఎదుట ఓ లాయ‌ర్ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. కోర్టు సుమోటోగా ఈ వ్య‌వ‌హారాన్ని విచార‌ణకు స్వీక‌రించాల‌ని కోరారు. అయితే, ఈ అభ్య‌ర్థ‌న‌ను ధ‌ర్మాస‌నం తోసిపుచ్చింది. "మా సమయాన్ని వృథా చేయకండి.. మీ స‌మ‌యాన్నీ వృథా చేసుకోకండి" అని సీజేఐ జ‌స్టిస్‌ సూర్య‌కాంత్ వ్యాఖ్యానించారు.

నీట్-యూజీ (NEET-UG 2026) పేపర్ లీక్, పరీక్ష నిర్వహణలో అక్రమాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో సంస్కరణలు వంటి అత్యంత ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలపైనే విద్యార్థులు నిరసన తెలుపుతున్నారని స‌ద‌రు లాయర్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. పోలీసుల దౌర్జన్యాలను నిరూపించే వీడియో ఆధారాలు కూడా త‌మ వ‌ద్ద ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అయితే, "మాకు వీడియోల పట్ల ఆసక్తి లేదు. వాటిని చూడ‌టానికి మాకు సమయం కూడా లేదు. మేము ఎలాంటి వీడియోలూ చూడాలనుకోవడం లేదు" అని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ తేల్చి చెప్పారు. ఇదిలా ఉండ‌గా.. నిర‌స‌న‌కారుల‌పై పోలీసుల చర్యలను ఖండిస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు మంగళవారం ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలోకి కోర్టును లాగొద్దు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇదే విధంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం.

నీట్ పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో కేంద్ర‌మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిరసనలను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగానే సోమ‌వారం పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం రోజు సీజేపీ చేప‌ట్టిన చ‌లో పార్ల‌మెంట్‌మార్చ్ ఉద్రిక్త‌త‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. పార్ల‌మెంట్ వైపుకు దూసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన నిర‌స‌న‌కారుల‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో 100 మందికిపైగా విద్యార్థులు, పోలీసులు గాయ‌ప‌డ్డారు. ఈ అంశంపై విప‌క్షాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసుల చ‌ర్య‌ల‌కు నిర‌స‌న‌గా కాంగ్రెస్ పెద్ద‌లు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి నేత‌లు నిన్న ప్ర‌ధాన మంత్రి అధికారిక నివాసం ముందు మెరుపు ధ‌ర్నాకు దిగిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఢిల్లీలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Also Read..

బీఆర్ఎస్‌, బీజేపీ ల‌క్ష్యం ఒక్క‌టే.. అందుకే నాపై కుట్ర‌: సీఎం రేవంత్‌

మూడో రోజూ అదే ప‌రిస్థితి.. ఉభ‌య‌స‌భ‌లు ప్రారంభ‌మైన వెంట‌నే వాయిదా

ఇక కార్ల‌కు మ‌రింత సేఫ్టీ.. కొత్త డ్యాష్ క్యామ్‌లు లాంచ్‌.. సిమ్ క‌నెక్టివిటీ స‌దుపాయం..

Advertisement
Advertisement