Parliament Monsoon Session | మూడో రోజూ అదే పరిస్థితి.. ఉభయసభలు ప్రారంభమైన వెంటనే వాయిదా
Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) వరుసగా మూడోరోజూ ప్రారంభమయ్యాయి. ఇవాళ కూడా ఉభయసభల్లో గందరగోళం నెలకొంది.
Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) వరుసగా మూడోరోజూ ప్రారంభమయ్యాయి. ఇవాళ కూడా ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఈనెల 20న ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను ప్రతిపక్ష ఎంపీలు (Opposition MPs) తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు ఉదయం 11 గంటలకు లోక్‌సభ (Lok Sabha) ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీల ఎంపీలంతా నిరసనకు దిగారు. ఈ అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టారు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. నిరసనలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మరోవైపు అటు ఎగువ సభలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో రాజ్యసభ (Rajya Sabha) కూడా మధ్యాహ్నానికి వాయిదా పడింది.
మరోవైపు ప్రతిపక్ష ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అఖిలేష్ యాదవ్, మహువా మొయిత్రా, అవధేష్ ప్రసాద్ తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలంతా బ్లాక్ డ్రెస్‌లు ధరించి నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. మంత్రిని తొలగించలేనంతగా ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి ఉంది..? అంటూ ప్రశ్నించారు.

Also Read..
కరీంనగర్ భారీ దోపిడీ కేసులో ట్విస్ట్
ఒక్క రోజులోనే రూ.22వేలు పెరిగిన బంగారం ధర.. కొనుగోళ్లకు పెట్టుబడిదారుల ఆసక్తి..
మేమిద్దరం పెండ్లి చేసుకోవాలనుకున్నాం.. కానీ ఆమె మరొకరిని వివాహం చేసుకుంది..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల






