త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jharkhand minister | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి కుమార్తె సహా నలుగురు మృతి

Jharkhand minister | జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో మంత్రి దీపికా పాండే సింగ్ (Dipika Pandey Singh) కుమార్తె స‌హా న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు.

D

National | Published On Sep 24, 2026, 11.51 am IST

Jharkhand minister | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి కుమార్తె సహా నలుగురు మృతి
Advertisement

Jharkhand minister | త్రినేత్ర న్యూస్ : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జంషెడ్‌పూర్ (Jamshedpur) న‌గ‌రంలో గురువారం తెల్ల‌వారుజామున రోడ్డు ప‌క్క‌న ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఓ కారు వేగంగా వ‌చ్చి ఢీ కొట్టింది (car rams into parked truck). ఈ ప్ర‌మాదంలో జార్ఖండ్ మంత్రి (Jharkhand minister) దీపికా పాండే సింగ్ (Dipika Pandey Singh) కుమార్తె స‌హా న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సోనారీ పోలీసు స్టేష‌న్ (Sonari police station) ప‌రిధిలోని మెరైన డ్రైవ్ రోడ్డు (Marine Drive Road)లో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. తెల్ల‌వారుజామున 3 గంట‌ల ప్రాంతంలో అతివేగంగా ప్ర‌యాణిస్తున్న‌ కారు రోడ్డు ప‌క్క‌న ఆగి ఉన్న ట్ర‌క్కును వెనుక నుంచి బ‌లంగా ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులోని న‌లుగురు వ్య‌క్తులూ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాద తీవ్ర‌త‌కు కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. మృతులను సార్థక్ అగర్వాల్, నమన్ గుప్తా, వంశిక ఖండేల్వాల్, జార్ఖండ్ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె ఇస్తికా సింగ్‌గా గుర్తించారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మ‌రోవైపు విషాదంపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. కాగా, దీపికా పాండే గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు.

 

Also Read..

బ్యాంకుల స‌మ్మె ఎఫెక్ట్‌.. ఉద్యోగుల‌కు ముంద‌స్తు జీతాలు

కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో రూ.కోటి ప‌లికిన‌ గ‌ణేశ్ ల‌డ్డూ వేలం..

ఒక్క రోజులోనే రూ.15వేలు త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌.. ఇన్వెస్ట‌ర్ల‌కు కీల‌క హెచ్చ‌రిక‌..

Advertisement
Advertisement