Jagadish Reddy | బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జగదీశ్‌రెడ్డి ఫైర్
Jagadeesh Reddy | కేఆర్ఎంబీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం నుంచే సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయడాన్ని ఖండించారు.
- అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం
- దీనికి డీజీపీ సమాధానం చెప్పాలి..
- కేఆర్ఎంబీకి వినతిపత్రమిస్తామంటే ఎందుకీ అడ్డంకులు?
- సాగర్ వద్ద ఏపీ అక్రమ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది
- తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి హక్కులకు ముప్పు
Jagadish Reddy | కేఆర్ఎంబీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం నుంచే సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయడాన్ని ఖండించారు. సబితా ఇంద్రారెడ్డి, శ్రవణ్ కుమార్, కాలేరు వెంకటేశ్, భూపాల్‌రెడ్డి తదితర నేతలను ఎందుకు నిర్బంధిస్తున్నారో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ధర్నాలు, నిరసనలు చేసేందుకు వెళ్లడం లేదని, చట్టబద్ధంగా కేఆర్ఎంబీకి వినతిపత్రం ఇచ్చేందుకే వెళ్తున్నామని స్పష్టం చేశారు. కేవలం నలుగురు ప్రజాప్రతినిధులు వినతిపత్రం సమర్పించేందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.
నాగార్జునసాగర్ వద్ద అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని ఆరోపించారు. ఈ నిర్మాణాల వల్ల హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంచి నీళ్ల పేరుతో నీటిని తరలిస్తూ హైదరాబాద్ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల నీటి హక్కుల కోసం పోరాడుతుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి పూర్తిగా లొంగిపోయిందని విమర్శించారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేసి, కేఆర్ఎంబీకి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Srisailam Temple | శ్రీశైలంలో భక్తజన సందోహం.. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేత!
- ●Bisleri Water | మా నీరు తాగేందుకు పూర్తిగా సురక్షితమే.. FSSAI చర్యలపై బిస్లరీ వివరణ
- ●Dimple Hayathi | నాకింకా పెళ్లి కాలేదు - నెటిజన్ కామెంట్‌పై డింపుల్ హయతి రిప్లై
- ●WTC 2027 Final | డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు చావోరేవో..!
- ●IND Vs NZ | డ్రాగా ముగిసిన వెల్లింగ్టన్ టెస్టు.. భారత విజయానికి అడ్డుకట్ట వేసిన కివీస్ బ్యాటర్లు
- ●Virosh | అనిరుధ్, కావ్య మారన్ రిసెప్షన్లో విరోష్ - ఫొటోలు చూశారా?

Srisailam Temple | శ్రీశైలంలో భక్తజన సందోహం.. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేత!

Bisleri Water | మా నీరు తాగేందుకు పూర్తిగా సురక్షితమే.. FSSAI చర్యలపై బిస్లరీ వివరణ

Dimple Hayathi | నాకింకా పెళ్లి కాలేదు - నెటిజన్ కామెంట్‌పై డింపుల్ హయతి రిప్లై

WTC 2027 Final | డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు చావోరేవో..!



