Bullion Market | ఐదురోజుల నష్టాలకు బ్రేక్.. మళ్లీ పుంజుకున్న పసిడి, వెండి..!
Bullion Market | వరుస నష్టాలతో కుదేలైన పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.2,800 (2.3 శాతం) పెరిగి 10 గ్రాములకు రూ.1,24,550కు చేరింది. ఐదు రోజుల వరుస పతనానికి బ్రేక్ పడింది. వెండి ధర సైతం నాలుగు రోజుల నష్టాల తర్వాత కిలోకు రూ.3,600 (2.5 శాతం) ఎగబాకి రూ.1,51,390కు చేరింది.
International | Published On Nov 23, 2026, 12.58 pm IST
Bullion Market | వరుస నష్టాలతో కుదేలైన పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.2,800 (2.3 శాతం) పెరిగి 10 గ్రాములకు రూ.1,24,550కు చేరింది. ఐదు రోజుల వరుస పతనానికి బ్రేక్ పడింది. వెండి ధర సైతం నాలుగు రోజుల నష్టాల తర్వాత కిలోకు రూ.3,600 (2.5 శాతం) ఎగబాకి రూ.1,51,390కు చేరింది. గతవారం భారీ అమ్మకాలతో పసిడి, వెండి ధరలు ఏడాదికి పైగా కనిష్ట స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. ఎంసీఎక్స్‌లో బంగారం 11 శాతం (రూ.14,927) నష్టపోయి రూ.1,21,778 స్థాయికి చేరగా.. వెండి 16.2 శాతం (రూ.28,496) పతనమై రూ.1,47,758కు దిగివచ్చింది. ఈ నేపథ్యంలో తక్కువ ధరల వద్ద కొనుగోళ్లు, షార్ట్ కవరింగ్ ఊపందుకోవడంతో సోమవారం ధరలకు మద్దతు లభించింది.
గణాంకాలపై అందరి దృష్టి
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయంపై నెలకొన్న అంచనాలు బులియన్ మార్కెట్‌ను భారీగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా నవంబర్ 25న విడుదల కానున్న అమెరికా పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ (పీసీఈ) ద్రవ్యోల్బణ గణాంకాల కోసం ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు డాలర్ స్వల్పంగా బలహీనపడటం, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం కూడా పసిడి, వెండి ధరలకు తాత్కాలిక ఊరటనిచ్చాయి. గతవారం ఫెడ్ వడ్డీరేట్లపై అనుకూల సంకేతాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు మాత్రం బులియన్‌పై ఒత్తిడి పెంచాయి. ఈ నెల 25న యూఎస్ పీసీఈ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానుండగా.. డిసెంబర్ 4న ఉపాధి నివేదిక వెలువడనుంది. దాంతో లేబర్ మార్కెట్ పరిస్థితిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 9న ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయం, వడ్డీరేట్లకు సంబంధించి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఈ పరిణామాల ఆధారంగా ఫెడ్ తర్వాతి వడ్డీరేట్ల నిర్ణయంపై అంచనాలు మారే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదైనా.. ఫెడ్ వైఖరిలో మార్పులు వస్తే మళ్లీ అమ్మకాల ఒత్తిడి పెరగవచ్చని ప్రిత్వీ ఫిన్‌మార్ట్, జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి సంస్థల విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సమీప కాలంలో ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కొనుగోలుదారులు ఏం చేయాలి..
దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు, ఆభరణాల కొనుగోలుదారులు ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టకుండా విడతల వారీగా కొనుగోళ్లు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సిప్ తరహాలో దశలవారీగా పెట్టుబడి పెట్టడం, బంగారు ఆభరణాలను విడతల వారీగా కొనుగోలు చేయడం ద్వారా ధరల ఒడిదుడుకుల ప్రభావాన్ని కొంత తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 100 శాతం పెట్టుబడిని ఒకేసారి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నదేనని.. స్వల్పకాలిక ట్రేడర్లు మాత్రం ధరల పెరుగుదలను చూసి తొందరపడకుండా పొజిషన్ సైజింగ్, స్టాప్‌లాస్ వంటి రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Komatireddy Venkat Reddy | నా ప్లాన్ ప్రకారం పోతే 100 సీట్లకు పైగా గెలుస్తం
- ●CM Yogi Adityanath | సన్యాసిగా తల్లివద్ద భిక్షాటన.. భావోద్వేగానికి గురైన సీఎం యోగి
- ●BRS Party | పల్నాడు ప్రాజెక్టును అడ్డుకోవాలి
- ●NCERT | పాఠ్యపుస్తకాల నాసిరకం ముద్రణపై NCERT సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు హామీ
- ●Jagadish Reddy | బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జగదీశ్‌రెడ్డి ఫైర్
- ●Srisailam Temple | శ్రీశైలంలో భక్తజన సందోహం.. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేత!

Komatireddy Venkat Reddy | నా ప్లాన్ ప్రకారం పోతే 100 సీట్లకు పైగా గెలుస్తం

CM Yogi Adityanath | సన్యాసిగా తల్లివద్ద భిక్షాటన.. భావోద్వేగానికి గురైన సీఎం యోగి

BRS Party | పల్నాడు ప్రాజెక్టును అడ్డుకోవాలి

NCERT | పాఠ్యపుస్తకాల నాసిరకం ముద్రణపై NCERT సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు హామీ




