Road Accident | జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు మృతి
Road Accident | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది (speeding truck ran over a group of people).
Road Accident | త్రినేత్ర న్యూస్ : జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది (speeding truck ran over a group of people). ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బాలుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఖుంటి జిల్లా (Khunti district) కరా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. తోర్పావైపు నుంచి వస్తున్న 18 చక్రాల భారీ వాహనం కరా రైల్వే స్టేషన్-తోర్పా మార్గంలో అదుపుతప్పింది. రోడ్డుపక్కన నిలబడి ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కల్వర్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన బాలుడిని కుంతి సదర్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
ప్రజలకు దీపావళి కానుక.. భారీగా తగ్గిన మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్ ధర
గ్లోబల్ మార్కెట్లలో భారీ పతనం.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా..
భార్యతో గొడవ.. ఆమెతోపాటు ఏడుగురిని హత్యచేసిన క్యాబ్ డ్రైవర్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Metro RTC Common Pass | రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. భారీగా తగ్గిన మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్ ధర
- ●Stock Markets | గ్లోబల్ మార్కెట్లలో భారీ పతనం.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా..
- ●Cab Driver | భార్యతో గొడవ.. ఆమెతోపాటు ఏడుగురిని హత్యచేసిన క్యాబ్ డ్రైవర్
- ●Unaccounted Cash | రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అనుమానస్పద వ్యక్తి.. తనిఖీల్లో బయటపడ్డ రూ.1.40 కోట్లు
- ●Murder | ప్రేమ ఒకరితో.. నిశ్చితార్థం మరొకరితో.. ప్రియుడి చేతిలో యువతి దారుణహత్య
- ●Sai Dharam Tej | ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. డిసెంబర్లో వివాహం

Metro RTC Common Pass | రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. భారీగా తగ్గిన మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్ ధర

Stock Markets | గ్లోబల్ మార్కెట్లలో భారీ పతనం.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా..

Cab Driver | భార్యతో గొడవ.. ఆమెతోపాటు ఏడుగురిని హత్యచేసిన క్యాబ్ డ్రైవర్

Unaccounted Cash | రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అనుమానస్పద వ్యక్తి.. తనిఖీల్లో బయటపడ్డ రూ.1.40 కోట్లు





