త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heart Attack | గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి.. దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన సీఎం

Heart Attack | జార్ఖండ్‌లో (Jharkhand) అధికార పార్టీ (JMM) సీనియ‌ర్ నేత‌, రాష్ట్ర‌ ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్‌ సోను (Sudivya Kumar Sonu) గుండెపోటుతో (Heart Attack) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున రాంచీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

G

National | Published On Sep 6, 2026, 10.02 am IST

Heart Attack | గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి.. దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన సీఎం
Advertisement

Heart Attack | త్రినేత్ర‌.న్యూస్‌: జార్ఖండ్‌లో (Jharkhand) అధికార పార్టీ (JMM) సీనియ‌ర్ నేత‌, రాష్ట్ర‌ ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్‌ సోను (Sudivya Kumar Sonu) గుండెపోటుతో (Heart Attack) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున రాంచీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 56 ఏండ్ల సుదివ్య కుమార్ శ‌నివారం రాత్రి అస్వస్థతకు గుర‌య్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ద‌వాఖాన‌కు తరలించారు. ఆదివారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు కార్డియాక్ అరెస్ట్ కావ‌డంతో (Cardiac Arrest) మృతి చెందినట్లు పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

సుదివ్య సోను గిరిడీహ్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం)లో కీలక నేతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం విద్యా శాఖ మంత్రిగా ఉన్న ఆయన టూరిజం, ఆర్ట్స్, సాంస్కృతిక‌, స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మంత్రిగా అద‌న‌పు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆయన మృతిపై సీఎం హేమంత్‌ సోరేన్‌ (CM Hemant Soren) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోను ఆకస్మిక మృతి జేఎంఎం కుటుంబానికి, జార్ఖండ్‌ రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదివ్య సోను సేవలు, పార్టీకి చేసిన కృషిని స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సుదివ్య సోను ఆక‌స్మిక‌ మృతి జేఎంఎం కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని, ఆయ‌న పార్టీకి, జార్ఖండ్ ప్ర‌భుత్వానికి అంకిత‌మైన కామ్రేడ్ అంటూ జేఎంఎం ఎక్స్‌వేదిక‌గా పోస్ట్ చేసింది.

Advertisement
Advertisement