త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Yogi Adityanath | సన్యాసిగా త‌ల్లివ‌ద్ద‌ భిక్షాటన.. భావోద్వేగానికి గురైన సీఎం యోగి

CM Yogi Adityanath | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ (CM Yogi Adityanath) భావోద్వేగానికి గుర‌య్యారు. స‌న్యాసం స్వీక‌రించిన (Monk) త‌ర్వాత కాషాయ వ‌స్త్రాల‌తో తొలిసారి త‌న ఇంటి ముందు నిల్చొని భిక్షాట‌న చేసిన రోజుల‌ను గుర్తు చేసుకున్నారు.

D

National | Published On Nov 23, 2026, 12.49 pm IST

CM Yogi Adityanath | సన్యాసిగా త‌ల్లివ‌ద్ద‌ భిక్షాటన.. భావోద్వేగానికి గురైన సీఎం యోగి
Advertisement

CM Yogi Adityanath | త్రినేత్ర న్యూస్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ (CM Yogi Adityanath) త‌న త‌ల్లి సావిత్రి దేవి (Savitri Devi)ని త‌ల‌చుకుని తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. స‌న్యాసం స్వీక‌రించిన త‌ర్వాత కాషాయ వ‌స్త్రాల‌తో (Monk) తొలిసారి త‌న ఇంటి ముందు నిల్చొని భిక్షాట‌న చేసిన రోజుల‌ను గుర్తు చేసుకున్నారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా భావోద్వేగ లేఖ పెట్టారు.

యోగి త‌ల్లి సావిత్రి దేవి మూడు రోజుల క్రితం క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఉత్త‌రాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలోని పంచూర్ గ్రామంలో ఉన్న తన పూర్వీకుల నివాసంలో శుక్ర‌వారం ఉద‌యం తుది శ్వాస విడిచారు. శనివారం హరిద్వార్‌లోని నమామి గంగే ఘాట్ వ‌ద్ద ఆమె అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. తల్లి పార్థివ దేహానికి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పాడె మోసి, కన్నీటి పర్యంతమవుతూ తుది నివాళులర్పించారు. త‌ల్లి మ‌ర‌ణం త‌ర్వాత యోగి ఎక్స్ వేదిగాక భావోద్వేగ లేఖ రాశారు.

"తల్లి ప్రేమకు, త్యాగానికి ఈ ప్రపంచంలో ఏదీ సాటిరాదు. తల్లి లేనిదే ఈ సృష్టి లేదు. తల్లిని మించిన ప్రేమ లేదు. ప్రతి ఒక్కరి స్థానాన్ని తల్లి భర్తీ చేయగలదు. కానీ, తల్లి స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. తల్లి అంటే కేవలం జన్మనిచ్చేది మాత్రమే కాదు.. ఆమె ఈ సృష్టికి మూలం" అని అమ్మ గొప్ప‌త‌నాన్ని కొనియాడారు. 'యోగి కీ పాతీ' (Yogi Ki Pati) పేరుతో రాసిన ఈ తాజా లేఖను ఆయన సమస్త మాతృమూర్తులకు అంకితం చేశారు. సన్యాసిగా భిక్షాటనకు వెళ్లిన నాటి జ్ఞాపకాలను లేఖ‌లో గుర్తు చేసుకున్నారు.

సన్యాస దీక్ష స్వీకరించిన మూడేళ్ల తర్వాత కాషాయ వ‌స్త్రాలు ధ‌రించి పంచూర్‌లోని త‌న ఇంటి బ‌య‌ట నిల‌బ‌డి భిక్ష కోసం త‌న త‌ల్లిని పిలిచిన‌ట్లు యోగి చెప్పుకొచ్చారు. అప్పుడు కాషాయ దుస్తుల్లో త‌న‌ని చూసిన నా త‌ల్లి ఆశ్చ‌ర్య‌పోయింది. ఎందుకు స‌న్యాసం తీసుకున్నావు..? ఇంట్లో ఏం లోటు వచ్చింది..? భిక్ష అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని ప్ర‌శ్నించిన‌ట్లు పేర్కొన్నారు. "అమ్మా, స‌న్యాసం నా ధర్మం. ఒక యోగి ఆకలి కేవలం భిక్షతోనే తీరుతుంది. నేను ఇక్క‌డ ఉండ‌టానికి రాలేదు. కేవ‌లం భిక్ష అడ‌గడానికి వ‌చ్చాను. నువ్వు ఏది ఇచ్చినా నా సంక‌ల్పం నెర‌వేరుతుంది" అని చెప్పినట్లు నాటి జ్ఞాప‌కాల‌ను సీఎం గుర్తుచేసుకున్నారు.

"కొన్ని రుణాలు ఎప్పటికీ తీర్చుకోలేనివి. కానీ, మన కర్తవ్యాన్ని మనం కచ్చితంగా నిర్వర్తించగలం. ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తల్లుల పట్ల ఈ బాధ్యతను నెరవేర్చడానికి నేను కృషి చేస్తున్నాను. దిక్కులేని ఒక తల్లికి అండగా నిలవడం, నిరాదరణకు గురైన తల్లి బాధను అర్థం చేసుకోవడం, కష్టాల్లో ఉన్న తల్లి ముఖంలో చిరునవ్వు నింపడం.. ఇవే ప్రతి తల్లికి మనం ఇచ్చే నిజమైన గౌరవం అని సీఎం యోగి చెప్పుకొచ్చారు. ఆపదలో ఉన్న తల్లుల కష్టాలను అర్థం చేసుకుని వారి ముఖంలో చిరునవ్వు నింపేందుకు ప్రతి పౌరుడు ప్రతినబూనాలని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు.

Also Read..

పాఠ్యపుస్తకాల నాసిరకం ముద్రణపై NCERT సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు హామీ

మా నీరు తాగేందుకు పూర్తిగా సురక్షిత‌మే.. FSSAI చర్యలపై బిస్ల‌రీ వివరణ

డ్రాగా ముగిసిన వెల్లింగ్టన్‌ టెస్టు.. భారత విజయానికి అడ్డుకట్ట వేసిన కివీస్ బ్యాట‌ర్లు

Advertisement
Advertisement