త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganesh Laddu Auction | కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో రూ.కోటి ప‌లికిన‌ గ‌ణేశ్ ల‌డ్డూ వేలం..

Ganesh Laddu Auction | వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల్లో ల‌డ్డూ వేలం (Ganesh Laddu Auction) ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. బాలాపూర్‌తోపాటు ప‌లు చోట్ల రూ.ల‌క్ష‌ల్లో ల‌డ్డూ వేలం జ‌రుగుతుంది. మ‌రికొన్నిచోట్ల రికార్డు స్థాయిలో రూ.కోటికిపైగా ప‌లుకుతుంది.

G

Hyderabad | Published On Sep 24, 2026, 11.16 am IST

Ganesh Laddu Auction | కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో రూ.కోటి ప‌లికిన‌ గ‌ణేశ్ ల‌డ్డూ వేలం..
Advertisement

Ganesh Laddu Auction | త్రినేత్ర‌.న్యూస్‌: వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల్లో ల‌డ్డూ వేలం (Ganesh Laddu Auction) ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. బాలాపూర్‌తోపాటు ప‌లు చోట్ల రూ.ల‌క్ష‌ల్లో ల‌డ్డూ వేలం జ‌రుగుతుంది. మ‌రికొన్నిచోట్ల రికార్డు స్థాయిలో రూ.కోటికిపైగా ప‌లుకుతుంది. హైద‌రాబాద్ బండ్ల‌గూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో (Keerthi Richmond Villas) ల‌డ్డూ వేలం పాట స‌రికొత్త రికార్డు సృష్టించింది. ల‌డ్డూ కోసం విల్లాస్ నివాసితులు గ‌ణేశ్ ల‌డ్డూ కోసం పోటాపోటీగా వేలం పాట పాడారు. అయితే గ‌ణ‌ప‌య్యతోపాటు న‌వ‌రాత్రులు పూజ‌లు అందుకున్న లడ్డూను శక్తిమాన్‌ టీమ్ ఏకంగా రూ.1.01 కోట్లకు దక్కించుకుంది. విల్లాస్ స‌భ్యులు నాలుగు గ్రూపులుగా ఏర్పడి వేలం పాట‌లో పాల్గొన్నారు.

అయితే గత మూడేండ్ల‌తో పోలిస్తే ఈసారి ధర తగ్గింది. 2024లో రూ.1.87 కోట్లు, 2025లో రికార్డు స్థాయిలో రూ.2.31 కోట్లు పలికిన లడ్డూ ఈ ఏడాది రూ.1.01 కోట్లకు చేరింది. 2018లో కేవలం రూ. 25 వేలతో ప్రారంభమైన రిచ్‌మండ్ విల్లాస్ లడ్డూ వేలం, ఏటికేడు ఊహించని రీతిలో పెరుగుతూ వస్తున్న‌ది. భక్తితో పాటు సామాజిక బాధ్యతను కూడా జోడించడంతో ఈ వేలం పాటకు విశేష ఆదరణ లభిస్తుంది.

కాగా.. లడ్డూ వేలంలో సమకూరే నిధులను ఆర్పీ దియా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విల్లాస్‌లో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్లు, స్థానిక పేద కుటుంబాల పిల్లల పాఠశాల ఫీజులను ఈ నిధుల నుంచే చెల్లిస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే పేదలకు ఉచిత వైద్య సహాయం అందిస్తారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తారు.

Advertisement
Advertisement