త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NCERT | పాఠ్యపుస్తకాల నాసిరకం ముద్రణపై NCERT సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు హామీ

NCERT | 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో అక్షరాలు మసకగా (blurred), చిన్న ఫాంట్‌తో, డబుల్ ప్రింటింగ్‌తో ఉన్నాయంటూ వ‌స్తున్న ఫిర్యాదుల‌పై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) స్పందించింది. లోపాల‌కు బాధ్యులైన‌ ముద్రణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

D

National | Published On Nov 23, 2026, 12.13 pm IST

NCERT | పాఠ్యపుస్తకాల నాసిరకం ముద్రణపై NCERT సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు హామీ
Advertisement

NCERT | త్రినేత్ర న్యూస్ : పాఠ్యపుస్తకాల ముద్రణ నాణ్యతపై (textbook quality) వస్తున్న ఫిర్యాదులపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) స్పందించింది. ఈ అంశాన్ని తాము చాలా తీవ్రంగా పరిగ‌ణిస్తున్న‌ట్లు చెప్పింది. లోపాల‌కు బాధ్యులైన‌ ముద్రణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

పాఠ్య‌పుస్త‌కాల నాణ్య‌త‌పై న్యాయవాది వినీత్ జిందాల్ కేంద్ర విద్యాశాఖ మంత్రిని, విద్యా మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు. 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో అక్షరాలు మసకగా (blurred), చిన్న ఫాంట్‌తో, డబుల్ ప్రింటింగ్‌తో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాన్ని పరిశీలించినప్పుడు ముద్రణ నాణ్యత చూసి తాను ఎంతో ఆందోళన చెందినట్లు చెప్పారు. "పుస్తకంలో అక్షరాలు మరీ చిన్నవిగా, మసకగా, అస్పష్టంగా ముద్రించారు. దీనివల్ల విద్యార్థులు సౌకర్యవంతంగా చదవలేకపోతున్నారు. ఇలాంటి నాసిరకం పుస్తకాల వల్ల పిల్లల‌ కళ్లపై ఒత్తిడి, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది" అని ఆయన ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విద్యా మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆయ‌న పోస్టుకు నెటిజ‌న్లు సైతం మ‌ద్ద‌తు తెలిపారు. ఎన్‌సీఈఆర్‌టీ నాసిరకం పుస్తకాలను ముద్రిస్తోందని పలువురు మండిపడ్డారు. ఈ నేప‌థ్యంలో న్యాయ‌వాది విజ్ఞ‌ప్తిపై స్పందించిన‌ ఎన్‌సీఈఆర్‌టీ బాధ్యుత‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చింది. ప్రతి విద్యార్థికి స్పష్టమైన, చదవడానికి అనుకూలమైన పుస్తకాలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని స్ప‌ష్టం చేస్తూ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ లోపాలకు బాధ్యులైన ప్రింటర్లను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Also Read..

మా నీరు తాగేందుకు పూర్తిగా సురక్షిత‌మే.. FSSAI చర్యలపై బిస్ల‌రీ వివరణ

డ్రాగా ముగిసిన వెల్లింగ్టన్‌ టెస్టు.. భారత విజయానికి అడ్డుకట్ట వేసిన కివీస్ బ్యాట‌ర్లు

అనిరుధ్‌, కావ్య మార‌న్ రిసెప్ష‌న్‌లో విరోష్ - ఫొటోలు చూశారా?

Advertisement
Advertisement