త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Employees | బ్యాంకుల స‌మ్మె ఎఫెక్ట్‌.. ఉద్యోగుల‌కు ముంద‌స్తు జీతాలు

Employees | మూడు రోజుల‌ బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లను (September salaries) సాధారణ తేదీ కంటే ముందుగానే చెల్లించాల‌ని నిర్ణ‌యించింది.

D

National | Published On Sep 24, 2026, 11.26 am IST

Employees | బ్యాంకుల స‌మ్మె ఎఫెక్ట్‌.. ఉద్యోగుల‌కు ముంద‌స్తు జీతాలు
Advertisement

Employees | కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు (Central govt employees) గుడ్‌న్యూస్ అందింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటూ బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె (Bank Employees Strike) నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లను సాధారణ తేదీ కంటే ముందుగానే చెల్లించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌ కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

మూడు రోజుల‌ బ్యాంకుల సమ్మె కారణంగా లావాదేవీలకు అంతరాయం కలిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకుంది. సెప్టెంబ‌ర్ నెల‌కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లను ముంద‌స్తుగానే అంటే సెప్టెంబ‌ర్ 25నే చెల్లించేందుకు అనుమ‌తించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు డిఫెన్స్‌, పోస్టల్‌, టెలికమ్యూనికేషన్స్‌ విభాగాల ఉద్యోగులకు కూడా ఈ ఆదేశాలు వ‌ర్తించ‌నున్నాయి. అయితే, ఈ ముంద‌స్తు చెల్లింపుల‌ను జీతంగా కాకుండా అడ్వాన్స్ పేమెంట్‌గా పరిగణించనున్నారు. పూర్తి నెల‌కు సంబంధించిన జీతం, పెన్ష‌న్ లెక్క‌లు ఖ‌రారైన త‌ర్వాత వచ్చే అక్టోబర్ నెల చెల్లింపుల్లో తగిన సర్దుబాట్లు చేయనున్నారు.

ఆదివారం ప‌నిచేయ‌నున్న బ్యాంకులు

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మరో కీలక పోరాటానికి సిద్ధమయ్యారు. అన్ని శనివారాలు బ్యాంకులకు సెలవు ప్రకటించాలనే డిమాండ్‌తో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళన కారణంగా, రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సెప్టెంబర్ 27, 2026 (ఆదివారం) రోజున అన్ని ప్రభుత్వ రంగ, గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక కార్యకలాపాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి కూడా ఆమోదం లభించింది. బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం-లింక్ బ్రాంచ్‌లు అన్నీ పూర్తిగా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

Also Read..

బీ-1 బాంబర్లు, 100 అడుగుల రెడ్ కార్పెట్‌.. అమెరికాలో జిన్‌పింగ్‌కు గ్రాండ్ వెల్‌క‌మ్‌

జ్ఞానేశ్ ఇట్స్ డ‌న్ బ్రో.. అభిజీత్ దిప్కే ఆస‌క్తిక‌ర పోస్ట్‌

11 ఏండ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు.. యువ‌కుడికి ఐదేండ్ల జైలుశిక్ష‌

Advertisement
Advertisement