త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Terror Attack | జ‌మ్ము క‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడి.. కానిస్టేబుల్ మృతి

Terror Attack | జ‌మ్ము క‌శ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్ర‌దాడి (Terror Attack) జ‌రిగింది. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌పై ఉగ్ర‌వాది కాల్పులు జ‌రిపి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న‌లో స‌ద‌రు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.

D

National | Published On Jul 22, 2026, 3.04 pm IST

Terror Attack | జ‌మ్ము క‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడి.. కానిస్టేబుల్ మృతి
Advertisement

Terror Attack | జ‌మ్ము క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు (Terror Attack) రెచ్చిపోయారు. పోలీసుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ పోలీసు కానిస్టేబుల్ మ‌ర‌ణించారు (Police constable was killed). అత‌ను బ‌ద్గాం జిల్లాకు చెందిన ఇండియా రిజర్వ్ (IR) 3వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ ఖురేషి (35)గా గుర్తించారు.

అధికారులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. ప‌విత్ర‌ అమ‌ర్‌నాథ్ యాత్ర నేప‌థ్యంలో అనంత్‌నాగ్ (Anantnag) జిల్లాలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. స‌ద‌రు కానిస్టేబుల్ బుధ‌వారం ఉద‌యం లాల్ చౌక్ సమీపంలో విధుల్లో ఉండ‌గా.. అక్క‌డికి ద్విచ‌క్ర‌వాహ‌నంపై వ‌చ్చిన ఓ ఉగ్ర‌వాది కాల్పులు జ‌రిపాడు. అనంత‌రం అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌లో స‌ద‌రు కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది ఖురేషీని వెంట‌నే అనంత్‌నాగ్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (GMC) ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ప‌రీక్షించిన వైద్యులు అత‌ను అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు ధృవీక‌రించారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌తో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

దాడి ఘ‌ట‌న అనంత‌రం భ‌ద్ర‌తా ద‌ళాలు అల‌ర్ట్ అయ్యారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పులు జ‌రిపి పారిపోయిన‌ ఉగ్ర‌వాది కోసం గాలింపు చేప‌డుతున్నారు. ఇందులో భాగంగానే కీల‌క మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయ‌డంతోపాటూ ఆ ప్రాంతానికి అద‌న‌పు బ‌ల‌గాల‌ను త‌ర‌లించారు. దాడికి పాల్ప‌డిన ఉగ్ర‌వాది కోసం ఆ ప్రాంతాన్ని పూర్తిగా జ‌ల్లెడ ప‌డుతున్నారు.

Also Read..

ఢిల్లీలో హై అల‌ర్ట్‌.. 16 మెట్రో స్టేష‌న్లు క్లోజ్‌.. ఎందుకంటే..?

దిగొచ్చిన కేంద్రం.. నీట్ పేప‌ర్ లీక్ అంశంపై చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ ప్ర‌క‌ట‌న‌

మాజీ అగ్నివీరుల‌కు 50% రిజ‌ర్వేష‌న్లు.. ఎలాంటి ప‌రీక్ష‌లూ లేకుండానే పారామిలటరీ దళాల్లో చేరొచ్చు

Advertisement
Advertisement