త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pakistan-occupied Kashmir | పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోనూ నియోజకవర్గాల పునర్విభజన..

Pakistan-occupied Kashmir | పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్ము కశ్మీర్ భూభాగంలో (Pakistan-occupied Kashmir) నియోజకవర్గాల పునర్విభజన (Delimitation Bill) చేపట్టేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును తీసుకురాబోతోంది.

D

National | Published On Nov 28, 2026, 5.00 pm IST

Pakistan-occupied Kashmir | పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోనూ నియోజకవర్గాల పునర్విభజన..
Advertisement

Pakistan-occupied Kashmir | త్రినేత్ర న్యూస్ : పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్ము కశ్మీర్ భూభాగంలో (Pakistan-occupied Kashmir) నియోజకవర్గాల పునర్విభజన (Delimitation Bill) చేపట్టేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును తీసుకురాబోతోంది. న‌వంబ‌ర్ 30 నుంచి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంటు స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ ప్ర‌తిపాదిత డీలిమిటేషన్ బిల్లులో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌కు సంబంధించి కేంద్రం కీల‌క నిబంధ‌న‌ల‌ను చేర్చింది. భ‌విష్య‌త్తులో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం తిరిగి భారత నియంత్రణలోకి వస్తే.. అక్కడ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అమల్లోకి వ‌చ్చేలా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చట్టపరమైన నిబంధనలను తాజా బిల్లులో పొందుప‌రిచింది.

నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ప్రతిపాదిత చట్టంలోని సెక్షన్ 3(4) ప్రకారం పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్ము కశ్మీర్ ప్రాంతం ఆ ఆక్రమణ నుంచి విముక్తి పొందినప్పుడు అక్కడి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల సంఘమే (EC) డీలిమిటేషన్ కమిషన్‌గా వ్యవహరిస్తుంది. మిగిలిన ప్రాంతాల నియోజకవర్గాల పునర్విభజనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయనుండగా.. PoK ప్రాంతానికి మాత్రం నేరుగా ఎన్నికల సంఘమే ఆ బాధ్యతను నిర్వర్తించేలా ఈ బిల్లు వీలు క‌ల్పిస్తోంది. అయితే, ఈ బిల్లులో ఎక్క‌డా పీవోకే అనే ప‌దాన్ని కేంద్ర వాడ‌లేదు. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతంగానే పేర్కొంది. ఆ ప్రాంతం పాకిస్థాన్ ఆక్రమణ నుంచి విముక్తి పొందినప్పుడు మాత్రమే ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.

జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో 90 స్థానాల‌కు మాత్ర‌మే ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ కోసం ఎప్పటినుంచో 24 అసెంబ్లీ స్థానాలను రిజ‌ర్వ్ చేసి ఉంచారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో 50% సీట్లను పెంచాలని ప్రతిపాదించారు. అయితే, ఈ 50% సీట్ల పెంపు నిబంధన పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతానికి కేటాయించిన 24 స్థానాలకు కూడా వర్తిస్తుందా లేదా అనే దానిపై బిల్లులో స్పష్టత ఇవ్వలేదు.

మరోవైపు, ప్రతిపాదిత 132వ రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుగుణంగా ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలను పాలించే మూడు చట్టాలను సవరించేందుకు కేంద్రం ‘కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026’ను కూడా ప్రవేశపెట్టనుంది. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా సీట్లను 50 శాతం పెంచిన తర్వాత, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఈ రాజ్యాంగ సవరణ వీలు కల్పిస్తుంది. గత ఏప్రిల్‌లోనే ఈ రెండు బిల్లులతో పాటు 2029 నుంచి మహిళా రిజర్వేషన్లను అమలు చేసే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే, రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో తగిన మద్దతు లభించకపోవడంతో మిగిలిన రెండు బిల్లులు ఓటింగ్‌కు రాలేదు. ఈ నేపథ్యంలో పాత బిల్లులను ఉపసంహరించుకుని, కొత్త రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు వీటి కొత్త వెర్షన్లను సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Also Read..

బీజేపీకి దేశం కంటే ఎన్నిక‌లే ముఖ్యం : అఖిలేష్ యాద‌వ్‌

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి క‌థ‌తో సినిమా - ఆయోధ్య‌లో అర్జున్ దేశభక్తి మూవీ లాంఛ్

అయ్యో పాపం! ముగ్గురు ఆడ‌పిల్ల‌ల‌ను నీటి సంపులో ప‌డేసిన త‌ల్లి.. ఆ త‌ర్వాత ఏం చేసిందంటే!

Advertisement
Advertisement