J&K Encounter | జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తొయిబా ఉగ్రవాది హతం
J&K Encounter | సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడికి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. కుల్గామ్ (Kulgam) జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాది (Lashkar Terrorist) హతయ్యాడు. మృతి చెందిన ఉగ్రవాది లతీఫ్ భట్‌గా పోలీసులు గుర్తించారు. సీఆర్‌పీఎఫ్ బలగాలపై జరిగిన దాడి వెనుక లతీఫ్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
J&K Encounter | త్రినేత్ర న్యూస్ : జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లో ఎన్‌కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. గతవారం సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడికి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. కుల్గామ్ (Kulgam) జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాది (Lashkar Terrorist) హతయ్యాడు. మృతి చెందిన ఉగ్రవాది లతీఫ్ భట్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
గత వారం కుల్గామ్ జిల్లాలోని మీర్ బజార్ సమీపంలో ఉన్న అఖ్రాన్ (Akhran)లో గల CRPF పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. బైక్‌పై వచ్చిన దుండగులు భద్రతాబలగాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force post) సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన ఆర్మీ, CRPF, జమ్ము కశ్మీర్ పోలీసుల ప్రత్యేక బృందాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
కుల్గామ్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల లతీఫ్ గతంలో కార్పెంటర్‌గా పనిచేశాడు. 2025 నవంబర్‌లో అదృశ్యమై అతడు లష్కరే తొయిబా ఉగ్రసంస్థలో చేరాడు. ఓవర్‌గ్రౌండ్ వర్కర్ల నెట్‌వర్క్ సహాయంతో దక్షిణ కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో చిరుగ్గా వ్యవహరిస్తున్నాడు. నవంబర్ 11న సీఆర్‌పీఎఫ్ బలగాలపై జరిగిన దాడి వెనుక లతీఫ్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఈ ఏడాది జులైలో అనంతనాగ్, కుల్గామ్ ప్రాంతాల్లో ఓ పోలీస్ అధికారి, ఇద్దరు వలస కార్మికుల హత్య కేసుల్లోనూ ఇతను మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.
Also Read..
బిల్కిస్ బానో కేసు.. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు
భారత రక్షణ వ్యవస్థపై గూఢచర్య ముప్పు.. వైమానిక దళ అధిపతి కీలక హెచ్చరికలు
తాజావార్తలు
- ●Sreeleela | నైట్ షూటింగ్ - పగలు ప్రమోషన్స్ - శ్రీలీల డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా
- ●Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
- ●MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్
- ●Green India Challenge | కార్తీకమాసంలో హరిత సంకల్పం: ప్రతి ఇంటా ఉసిరి – ప్రతి గుడిలో బిల్వం
- ●Vidya Balan | బాలకృష్ణ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరోయిన్
- ●Airtel Insider | ఎయిర్టెల్ కస్టమర్లకు రూ.30 వేలకుపైగా ప్రయోజనాలు.. కొత్త రివార్డ్స్ ప్రోగ్రామ్..

Sreeleela | నైట్ షూటింగ్ - పగలు ప్రమోషన్స్ - శ్రీలీల డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..

MLA Anirudh Reddy | వైఎస్సార్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊకోను: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వార్నింగ్

Green India Challenge | కార్తీకమాసంలో హరిత సంకల్పం: ప్రతి ఇంటా ఉసిరి – ప్రతి గుడిలో బిల్వం






