Metro Stations Shut | ఢిల్లీలో హై అలర్ట్.. 16 మెట్రో స్టేషన్లు క్లోజ్.. ఎందుకంటే..?
Metro Stations Shut | దేశ రాజధాని ఢిల్లీ హై అలర్ట్‌లోకి వెళ్లిపోయింది. సీజేపీ నిరసనలు, ప్రతిపక్షాల ఆందోళనలతో భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు 16 మెట్రో స్టేషన్లను అధికారులు (Metro Stations Shut) మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆయా స్టేషన్లు క్లోజ్‌లోనే ఉంటాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానాకు వెళ్లే ముందు మెట్రో సేవలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Metro Stations Shut | కాక్రోచ్ పార్టీ నిరసనలు (CJP Protests), ప్రతిపక్షాల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు రాజధాని నగరాన్ని హై అలర్ట్‌లో (High Alert In Delhi) ఉంచారు. మెట్రో స్టేషన్లు, బస్‌స్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సీజేపీ నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు 16 మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అధికారికంగా ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆయా మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు (Metro Stations Shut) తెలిపింది. ఈ మేరకు క్లోజ్ చేసిన మెట్రో స్టేషన్ల వివరాలను ఎక్స్‌లో షేర్ చేసింది.
లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమం మార్గ్, బరాఖంభ రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్థం, జనపథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ITO, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థం, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం మెట్రోస్టేషన్లన తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ మూసివేసినట్లు డీఎమ్ఆర్‌సీ తెలిపింది. అయితే, ప్రయాణికుల సౌకర్యార్థం రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్చేంజ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఆ రెండు మెట్రో స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లే ముందు మెట్రో సేవలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచించారు. మెట్రో స్టేషన్లను మూసివేయడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తదితర ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Service Update
Below mentioned Metro stations have been closed till further instructions. However, Interchange facility shall remain available at Rajiv Chowk, Mandi House and Central Secretariat.
1. Lok Kalyan Marg
2. Rajiv Chowk
3. Patel Chowk
4. Ramakrishna Ashram Marg
5.…— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) July 22, 2026
Service Update
Due to Security reasons Janpath, Rajiv Chowk, Patel Chowk and Central Secretariat metro stations have been closed till further instructions. Interchange facility is available at Rajiv Chowk and Central Secretariat.
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) July 22, 2026
Also Read..
మాజీ అగ్నివీరులకు 50% రిజర్వేషన్లు.. ఎలాంటి పరీక్షలూ లేకుండానే పారామిలటరీ దళాల్లో చేరొచ్చు
దిగొచ్చిన కేంద్రం.. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు సిద్ధమంటూ ప్రకటన
సంబంధిత వార్తలు

Pralhad Joshi Education Minister | ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
జులై 25, 2026

Dharmendra Pradhan | కాక్రోచ్లకు తలొంచక తప్పలేదు.. రేపటితో తేలనున్న ధర్మేంద్ర ప్రధాన్ భవితవ్యం
జులై 24, 2026

Rahul Gandhi | మీకు ఎంత ధైర్యం..? ఢిల్లీ వర్సిటీ వార్నింగ్‌పై రాహుల్ గాంధీ ఫైర్
జులై 24, 2026
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?



