త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishtwar | బుల్లెట్ గాయాల‌తో ఇద్ద‌రు పోలీసుల‌ మృత‌దేహాలు.. ఉగ్ర‌వాదుల ప‌నేనా..?

Kishtwar | జ‌మ్ము క‌శ్మీర్‌ (Jammu and Kashmir) కిష్త్వార్ (Kishtwar) జిల్లాలో ఇద్ద‌రు స్పెష‌ల్ పోలీసు ఆఫీస‌ర్లు (Special Police Officers) అనుమానాస్ప‌ద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్ గాయాల‌తో వారి మృత‌దేహాల‌ను అట‌వీ ప్రాంతంలో అధికారులు గుర్తించారు.

D

National | Published On Nov 12, 2026, 11.43 am IST

Kishtwar | బుల్లెట్ గాయాల‌తో ఇద్ద‌రు పోలీసుల‌ మృత‌దేహాలు.. ఉగ్ర‌వాదుల ప‌నేనా..?
Advertisement

Kishtwar | త్రినేత్ర న్యూస్ : జ‌మ్ము క‌శ్మీర్‌లో (Jammu and Kashmir) ఇద్ద‌రు పోలీసు ఆఫీస‌ర్లు అనుమానాస్ప‌ద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. కిష్త్వార్ (Kishtwar) జిల్లాలో ద‌చ‌న్‌-మ‌ర్వా ప్రాంతంలో (Dachhan-Marwah area) పెట్రోలింగ్ నిర్వ‌హిస్తుండ‌గా ఇద్ద‌రు స్పెష‌ల్ పోలీసు ఆఫీస‌ర్లు (Special Police Officers) అదృశ్య‌మ‌య్యారు. వారి కోసం భ‌ద్ర‌తా సిబ్బంది గాలింపు చేప‌ట్ట‌గా.. ధెర్నా పోస్ట్ (Dherna post) స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో ఇద్ద‌రి మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. మృతి చెందిన అధికారులు రశ్‌పాల్ కుమార్ (40), బాబి చంద్ (54)గా గుర్తించారు.

ఇద్ద‌రు ఆఫీస‌ర్ల బాడీల‌పై బుల్లెట్ గాయాలు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో మాటువేసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు, ఆ ఇద్ద‌రు ఆఫీస‌ర్లు త‌మ వెంట తీసుకెళ్లిన స‌ర్వీసు తుపాకులు కూడా క‌నిపించ‌కుండా పోయాయి. ఉగ్ర‌వాదులే వీరిని హ‌త్య చేసి ఆయుధాల‌ను ఎత్తుకెళ్లిన‌ట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

నిన్న మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో వీరిద్ద‌రూ ధెర్నా పోస్టుకు వెళ్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలో అదృశ్య‌మ‌య్యారు. కాసేప‌టికి వారి మొబైల్ ఫోన్లు కూడా ప‌నిచేయ‌కుండా పోయాయి. అదే స‌మ‌యంలో అక్క‌డ కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయి. ఎస్పీఓలు ఇద్దరూ తిరిగి రాకపోవడంతో భద్రతా బలగాలు అనుమానం వ‌చ్చి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్ర‌మంలోనే ఇవాళ ఉద‌యం వారి మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వారిని ప‌ట్టుకునేందుకు పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సంయుక్తంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

కాగా, నిన్న మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల స‌మ‌యంలో కుల్గామ్ (Kulgam) జిల్లాలోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్ర‌దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. మీర్ బజార్ సమీపంలో ఉన్న అఖ్రాన్ (Akhran)లోఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు భ‌ద్ర‌తా సిబ్బందిపై కాల్పులు జ‌రిపి అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. ఈ దాడిలో ఇద్ద‌రు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force post) సిబ్బంది గాయపడ్డారు. అదే స‌మ‌యంలో కిష్త్వార్ జిల్లాలో ఇద్ద‌రు ఆఫీస‌ర్లు అదృశ్యం కావ‌డం గ‌మ‌నార్హం.

Also Read..

అనిరుధ్‌-కావ్య మారన్‌ పెళ్లి ఫొటోలు చూశారా..?

14న గిగ్ వ‌ర్క‌ర్ల‌తో రాహుల్ గాంధీ ర్యాలీ.. HICC వద్ద ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రులు

రోడ్డు ప్ర‌మాదంలో శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు గాయాలు

Advertisement
Advertisement