త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lok Sabha | దిగొచ్చిన కేంద్రం.. నీట్ పేప‌ర్ లీక్ అంశంపై చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ ప్ర‌క‌ట‌న‌

Lok Sabha | నీట్ పేప‌ర్ లీక్ (NEET Paper Leak) అంశంపై లోక్‌స‌భ‌లో చ‌ర్చ‌కు కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది. ఈ అంశంపై పార్ల‌మెంట్‌లో చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) ప్ర‌క‌టించారు.

D

National | Published On Jul 22, 2026, 1.26 pm IST

Lok Sabha | దిగొచ్చిన కేంద్రం.. నీట్ పేప‌ర్ లీక్ అంశంపై చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ ప్ర‌క‌ట‌న‌
Advertisement

Lok Sabha | ఓవైపు కాక్రోచ్ పార్టీ నిర‌స‌న‌లు.. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష పార్టీల ఆందోళ‌న‌ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు దిగొచ్చింది. నీట్ పేప‌ర్ లీక్ (NEET Paper Leak) అంశంపై వివ‌ర‌ణాత్మ‌క చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది. ఈ అంశంపై పార్ల‌మెంట్‌లో చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) ప్ర‌క‌టించారు. బుధ‌వారం ఉద‌యం ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో లోక్‌స‌భ (Lok Sabha)లో కిర‌ణ్ రిజుజు మాట్లాడుతూ.. విద్యార్థులే త‌మ ప్ర‌భుత్వ మొద‌టి ప్రాధాన్య‌త అని చెప్పారు. నీట్ పేప‌ర్ లీకేజీ అంశంపై స‌భ‌లో స‌మ‌గ్రంగా చ‌ర్చ జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

"నీట్ (NEET) పేపర్ లీక్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని మేము గత మూడు రోజులుగా చెబుతూనే ఉన్నాము. నిబంధనల ప్రకారమే చర్చలు జరగాలి. ఈ అంశంపై చర్చించడానికి కేంద్రానికి ఎలాంటి అభ్యంతర‌మూ లేదు. అయితే చర్చ చేపట్టే ముందు పార్లమెంటరీ విధానాలను తప్పక పాటించాలి" అని ఆయన స్పష్టం చేశారు. నీట్ అంశంపై స‌భ‌లో చ‌ర్చ ఎప్పుడు చేప‌ట్టాలి, ఎంత స‌మ‌యం కేటాయించాలి, ఏ నిబంధ‌న కింద చ‌ర్చ జ‌ర‌గాలి అనే విష‌యాల‌ను అన్ని పార్టీల ఫ్లోర్ లీడ‌ర్ల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. "దేశ యువత భవిష్యత్తు కోసం నిర్మాణాత్మకమైన చర్చ జరగాలి. ప్రభుత్వం కోరుకునేది కూడా ఇదే" అని రిజుజు నొక్కి చెప్పారు.

చ‌ర్చ‌కు ముందు.. ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి..

అయితే, చర్చకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ప్ర‌తిప‌క్షాలు మాత్రం విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాల‌నే డిమాండ్‌కే క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేశాయి. స‌భ‌లో ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గడానికైనా ముందే ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ ఎంపీ ప‌వ‌న్ ఖేరా స్ప‌ష్టం చేశారు.

అందుకే ప్ర‌ధాని నివాసం వ‌ద్ద ధ‌ర్నా చేశాం..

అదే స‌మ‌యంలో నిర‌స‌న‌కారుల‌పై పోలీసుల దౌర్జ‌న్యం అంశాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) స‌భ‌లో లేవ‌నెత్తారు. ఈ అంశంపై ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న చేయాల‌ని డిమాండ్ చేశారు. అదే స‌మ‌యంలో నిన్న ప్ర‌ధాని ఇంటి ముందు ధ‌ర్నా అంశాన్ని ప్ర‌స్తావించారు. ప్ర‌ధాని పార్ల‌మెంట్‌లో మాట్లాడ‌రు కాబ‌ట్టే.. ఆయ‌న నివాసం ముందు ధ‌ర్నా చేయాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. "ప్రధాని యువత సమస్యలపై పార్లమెంట్ వెలుపల మాట్లాడతారు. కానీ సభలో ఎందుకు ప్రకటన చేయలేకపోతున్నారు..?" అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.

Also Read..

జులై 20 నిరసనలు కేవ‌లం ట్రైలర్ మాత్రమే.. కేంద్రం స్పందించ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వు : సీజేపీ

ప్ర‌ధాని మోదీతో ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ భేటీ

వీడియోలు చూసేంత టైమ్ మాకు లేదు.. నిర‌స‌న‌కారుల‌పై పోలీసుల చ‌ర్య‌లో జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాక‌ర‌ణ‌

Advertisement
Advertisement