త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ex Agniveers | మాజీ అగ్నివీరుల‌కు 50% రిజ‌ర్వేష‌న్లు.. ఎలాంటి ప‌రీక్ష‌లూ లేకుండానే పారామిలటరీ దళాల్లో చేరొచ్చు

Ex Agniveers | కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మాజీ అగ్నివీరులు (Ex Agniveers) భారతదేశ పారామిలటరీ దళాల్లో చేరేందుకు కీల‌క మిన‌హాయింపులు ఇచ్చింది. కానిస్టేబుల్‌, రైఫిల్‌మ్యాన్‌ పోస్టుల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింది.

D

National | Published On Jul 22, 2026, 1.59 pm IST

Ex Agniveers | మాజీ అగ్నివీరుల‌కు 50% రిజ‌ర్వేష‌న్లు.. ఎలాంటి ప‌రీక్ష‌లూ లేకుండానే పారామిలటరీ దళాల్లో చేరొచ్చు
Advertisement

Ex Agniveers | కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మాజీ అగ్నివీరులు భారతదేశ పారామిలటరీ దళాల్లో (Central Armed Police Forces) చేరేందుకు కీల‌క మిన‌హాయింపులు ఇచ్చింది. కానిస్టేబుల్‌, రైఫిల్‌మ్యాన్‌ పోస్టుల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింది. వీరికి రాత‌ప‌రీక్ష‌తోపాటూ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) లాంటి శారీరక సామర్థ్య పరీక్షల నుంచి మిన‌హాయింపులు ఇచ్చింది. నాలుగేండ్ల పదవీకాలం పూర్తయ్యాక అగ్నిపథ్‌ పథకం నుంచి బయటకు వచ్చే సైనికుల ఉపాధి భ‌ద్ర‌త‌కు ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుందో చెప్పాల‌ని బీజేపీ ఎంపీ జ‌నార్ధ‌న్ సింగ్ సిగ్రివాల్ అడిగిన ప్ర‌శ్న‌కు.. హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు.

ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో.. మాజీ అగ్నివీరుల‌ను సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF), బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ITBP), సశస్త్ర సీమా బల్‌ (SSB), అస్సాం రైఫిల్స్‌లోని కానిస్టేబుల్‌, రైఫిల్‌మ్యాన్‌ పోస్టులకు డైరెక్ట్‌గా ఎంపిక చేస్తారు. అదేవిధంగా ఆయా పోస్టుల‌కు సంబంధించి వీరికి అదనంగా మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు కల్పించారు. ఇక అగ్నిప‌థ్ ప‌థ‌కంలో చేరిన మొద‌టి బ్యాచ్ అభ్య‌ర్థుకుల మాత్రం ఐదేళ్ల వయస్సు సడలింపు ఇచ్చారు.

Also Read..

దిగొచ్చిన కేంద్రం.. నీట్ పేప‌ర్ లీక్ అంశంపై చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ ప్ర‌క‌ట‌న‌

జులై 20 నిరసనలు కేవ‌లం ట్రైలర్ మాత్రమే.. కేంద్రం స్పందించ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వు : సీజేపీ

5జి స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయం.. లైట్ ఫ్లిప్ ఫోన్ లాంచ్.. అడిక్ష‌న్ త‌గ్గించుకోవ‌డం ఈజీ..

Advertisement
Advertisement