త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hisense E8S | హైసెన్స్ కొత్త ఈ8ఎస్ మినీ-ఎల్ఈడీ టీవీలు.. 144హెడ్జ్‌ గేమింగ్‌తో అదిరిపోయిన‌ ఫీచర్లు..

Hisense E8S | టీవీల త‌యారీ సంస్థ హైసెన్స్ భారత మార్కెట్లో కొత్త ఈ8ఎస్ 144హెడ్జ్ యూఎల్ఈడీ మినీ-ఎల్ఈడీ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ సిరీస్, ఇటీవల ఆఫ్‌లైన్ రిటైల్ ఛానళ్లలో విడుదలైన యూ7ఎస్ఈ సిరీస్‌కు కొనసాగింపుగా మార్కెట్లోకి వచ్చింది.

S

Business | Published On Jun 18, 2026, 6.08 pm IST

Hisense E8S | హైసెన్స్ కొత్త ఈ8ఎస్ మినీ-ఎల్ఈడీ టీవీలు.. 144హెడ్జ్‌ గేమింగ్‌తో అదిరిపోయిన‌ ఫీచర్లు..
Advertisement

Hisense E8S | టీవీల త‌యారీ సంస్థ హైసెన్స్ భారత మార్కెట్లో కొత్త ఈ8ఎస్ 144హెడ్జ్ యూఎల్ఈడీ మినీ-ఎల్ఈడీ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ సిరీస్, ఇటీవల ఆఫ్‌లైన్ రిటైల్ ఛానళ్లలో విడుదలైన యూ7ఎస్ఈ సిరీస్‌కు కొనసాగింపుగా మార్కెట్లోకి వచ్చింది. కొత్త ఈ8ఎస్ సిరీస్‌లో యూఎల్ఈడీ మినీ-ఎల్ఈడీ టెక్నాలజీతోపాటు ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ సదుపాయం అందించారు. దీని వల్ల స్క్రీన్‌పై మరింత డీప్ బ్లాక్స్, అధిక కాంట్రాస్ట్, బ్యాక్‌లైట్‌పై క‌చ్చితమైన నియంత్రణ లభిస్తుంది. హై-క్యూఎల్ఈడీ కలర్ టెక్నాలజీతో పటు పాంటోన్ వాలిడేషన్‌ను కూడా అందించారు. దీంతో రంగులు మరింత సహజంగా, కచ్చితంగా కనిపించడంతోపాటు ప్రకాశవంతమైన సన్నివేశాల్లోనూ మెరుగైన విజువల్ అనుభవం లభిస్తుంది.

యూనీబాడీ స్లిమ్ డిజైన్‌, ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే..

టీవీల‌ను స్లీక్ యూనీబాడీ స్లిమ్ డిజైన్‌తో రూపొందించారు. ఆధునిక ఇంటీరియర్లకు సరిపోయేలా డిజైన్ చేయడంతోపాటు స్క్రీన్ ఇమర్షన్‌ను పెంచే విధంగా రూపకల్పన చేశారు. పనితీరును హై-వ్యూ ఏఐ ఇంజిన్ నిర్వహిస్తుంది. ఇది కంటెంట్‌ను బట్టి రియల్‌టైమ్‌లో పిక్చర్ క్వాలిటీ, కాంట్రాస్ట్, కలర్‌లను ఆటోమేటిగ్గా ఆప్టిమైజ్ చేస్తుంది. 85 ఇంచుల మోడల్‌లో హై-వ్యూ ఏఐ ఇంజిన్ ప్రో అందుబాటులో ఉండి మరింత స్పష్టత, డీటైల్, సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ టీవీల్లో నేటివ్ 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. దీని వల్ల వేగంగా కదిలే గేమ్స్, స్పోర్ట్స్ కంటెంట్‌లో స్మూత్ మోషన్, తక్కువ బ్లర్, తక్కువ లేటెన్సీ లభిస్తుంది. ఆడియో విభాగంలో డెవియాలెట్ ట్యూన్ చేసిన బిల్ట్-ఇన్ సబ్‌వూఫర్‌ను అందించారు. అదనపు స్పీకర్లు అవసరం లేకుండా డీప్ బాస్‌తో శక్తివంతమైన సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది.

ధ‌ర వివ‌రాలు..

ఈ టీవీలు విడా స్మార్ట్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తాయి. హెచ్‌డీఆర్10 ప్ల‌స్ అడాప్టివ్, డాల్బీ విజన్ ఐక్యూ, ఫిల్మ్‌మేకర్ మోడ్, ఏఐ ఆర్‌జీబీ లైట్ సెన్సర్, హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా వీటిలో ఉన్నాయి. ఈ టీవీలు 55, 65, 75, 85 ఇంచుల సైజుల్లో అందుబాటులోకి వచ్చాయి. కనెక్టివిటీ పరంగా నాలుగు హెచ్‌డీఎంఐ పోర్టులు, యూఎస్‌బీ 3.0, యూఎస్‌బీ 2.0, ఆప్టికల్ ఆడియో అవుట్, ఈథర్నెట్, వై-ఫై 2.4/5 గిగాహెడ్జ్‌, బ్లూటూత్ 5.4 వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇక 55 ఇంచుల మోడల్ ధరను రూ.57,990గా నిర్ణయించారు. 65 ఇంచుల మోడల్ ధ‌ర రూ.76,990 ఉండ‌గా, 75 ఇంచుల మోడల్ ధ‌ర‌ రూ.99,990గా ఉంది. 85 ఇంచుల టాప్ వేరియంట్ ధర రూ.1,59,990గా ఉంది. ఈ టీవీ సిరీస్‌ను ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నారు. ప్రారంభ ఆఫర్లలో భాగంగా 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐతోపాటు ప్రత్యేక డిస్కౌంట్ల‌ను కూడా అందిస్తున్నారు.

Advertisement
Advertisement