INDIA bloc | లోక్‌సభలో 200 దిగువకు ఇండీ బలం..
INDIA bloc | దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ తన ఉనికిని కోల్పోతోందా..? గత ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు ప్రమాదంలో పడిందా..? ఇండీ కూటమిని (INDIA bloc) సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో హస్తం పార్టీ విఫలమవుతోందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు.
- కూటమి నుంచి వైదొలగిని ఆప్, డీఎంకే..
- టీఎంసీలో తిరుగుబాటుతో కూటమిపై ప్రభావం
- కాంగ్రెస్ నాయకత్వంపై సన్నగిల్లుతున్న నమ్మకం
INDIA bloc | దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ తన ఉనికిని కోల్పోతోందా..? గత ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు ప్రమాదంలో పడిందా..? ఇండీ కూటమిని (INDIA bloc) సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో హస్తం పార్టీ విఫలమవుతోందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు. రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమికి గట్టి పోటీనిస్తూ రెండో స్థానాన్ని దక్కించుకున్న 'ఇండియా' (INDIA) కూటమి.. ఇప్పుడు లోక్‌సభలో తన బలాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అంతర్గత విభేదాలు, వరుస ఎన్నికల ఓటములు, కీలక మిత్రపక్షాలు వైదొలగడం వంటి కారణాల వల్ల సభలో ఇండీ బలం రోజురోజుకూ పడిపోతోంది.
189కి చేరిన ఇండీ బలం..
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఈ కూటమి 234 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే హస్తం పార్టీతో విభేదాల కారణంగా ముగ్గురు సభ్యులున్న ఆప్ పార్టీ కూటమి నుంచి వైదొలిగింది. అటు తమిళనాడులో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న 22 మంది సభ్యులున్న డీఎంకే (DMK) కూడా కాంగ్రెస్‌ను మిత్ర ద్రోహి అంటూ కూటమి నుంచి ఎగ్జిట్ అయ్యింది. దీంతో లోక్‌సభలో ఇండీ బలం 209కి పడిపోయింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీఎంసీ (TMC) ఎంపీలు 20 మంది మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసి, ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించారు. దీంతో కూటమి బలం ప్రస్తుతం 200 మార్క్ కంటే దిగువకు పడిపోయి 189కి చేరింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆప్ ఎంపీల తిరుగుబాటు, టీఎంసీ ఎంపీల రాజీనామాతో ఎగువ సభలోనూ ప్రతిపక్ష బలం రోజురోజుకూ తరిగిపోతోంది.
కాంగ్రెస్ తీరు మార్చుకోవాలి..
కూటమి ప్రస్తుతం అనేక అంతర్గత సమస్యలను ఎదుర్కొంటోంది. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలిగింది. తమిళనాడులో డీఎంకే ఓటమి పాలైంది. దీంతో అక్కడ ప్రభుత్వ భాగస్వామ్యం కోసం దశాబ్దాల పాటూ మిత్రపక్షంగా ఉన్న డీఎంకేని హస్తం పార్టీ పక్కన పెట్టేసింది. రాష్ట్రాల్లో ఎన్నికలొచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలపై ఇదే ధోరణి ప్రదర్శిస్తోంది. దీంతో మిత్రపక్షాలకు కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లింది. హస్తం నేతలపై మిత్ర ద్రోహం ఆరోపణలు చేస్తున్నాయి. హస్తం పార్టీ తన పద్ధతిని మార్చుకోవాలంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే.. ఐక్యంగా ముందుకెళ్లాలని ఇటీవలే జరిగిన ఇండియా బ్లాక్ సదస్సులో పలు పార్టీల నేతలు సూచించారు. ఒక వేళ కాంగ్రెస్ తీరు మారకపోతే.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ (UP) సహా పలు కీలక రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల ఫలితాలు ఈ కూటమి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పుంజుకుంటున్న ఎన్డీయే..
అదే సమయంలో పార్లమెంట్‌లో ఎన్డీయే బలం పుంజుకుంటోంది. మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీ.. ఇప్పుడు ఇతర పార్టీలపై ఆధారపడకుండా ఉండేందుకు తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తృణమూల్‌లో చీలికతో లోక్‌సభలో (Lok Sabha) ఎన్డీయే తన బలాన్ని పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎన్డీయేకి లోక్‌సభలో ప్రస్తుతం 293 మంది ఎంపీలు ఉన్నారు. 20 మంది టీఎంసీ ఎంపీలు కూడా మద్దతు ఇవ్వడంతో సంఖ్యాబలం 313కు పెరిగింది. డీఎంకే, ఇతర చిన్న పార్టీల మద్దతు కూడా కూడగట్టేందుకు మోదీ సర్కార్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాలతో పార్లమెంట్‌లో ఎన్డీయేకి ఇక తిరుగులేదనే చెప్పాలి. కీలకమైన బిల్లులు ఈజీగా గట్టెకే అవకాశం ఉంది.
Also Read..
గూగుల్ జెమినీ 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్.. మాట్లాడే సమయంలో వెంట వెంటనే అనువాదం..
ప్రపంచ ఫుడ్ మ్యాప్‌లో దుమ్మురేపిన బెంగళూరు.. 2026 బెస్ట్ ఫుడ్ సిటీస్ జాబితాలో 13వ స్థానం..
కంగ్రాట్స్ మై డియర్ ఫ్రెండ్.. మోదీకి మెలోనీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Anti Paper Leak Bill | పరీక్షల్లో అక్రమాలకు ఇక చెక్.. పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జులై 29, 2026

Rahul Gandhi | లోక్‌సభలో రాహుల్ Vs కేంద్రం.. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై సభలో రగడ
జులై 29, 2026

Jitendra Singh | యూపీఏ హయాంలోనే పేపర్ లీక్‌లు.. అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు..? : జితేంద్ర సింగ్
జులై 28, 2026
తాజావార్తలు
- ●Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!
- ●Minister Tummala | సీతమ్మసాగర్కు సుప్రీం ‘లైన్ క్లియర్’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!
- ●Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!
- ●Bonalu | న్యూయార్క్‌లో మార్మోగిన తెలంగాణ బోనాల సందడి
- ●TG Police Jobs | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!

Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!

Minister Tummala | సీతమ్మసాగర్కు సుప్రీం ‘లైన్ క్లియర్’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట

Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!

Ashika Ranganath | మెగాస్టార్ సినిమాలో అవకాశం.. ఆషిక ఆశలన్నీ ‘విశ్వంభర’పైనే!



