Indigenous Hovercraft India | సముద్ర జలాల్లో మరింత పటిష్టంగా ఇండియన్ కోస్ట్‌గార్డ్.. తొలి స్వదేశీ ‘హోవర్‌క్రాఫ్ట్’ ఎంట్రీ!
సముద్ర జలాల్లో నిఘా మరింత పటిష్టం చేసేందుకు ఇండియన్ కోస్ట్‌గార్డ్ తొలి స్వదేశీ ఎయిర్ కుషన్ వెహికల్ (ACV) 'H-561'ను ప్రవేశపెట్టింది. దీని ప్రత్యేకతలు ఇవే.
- ఇండియన్ కోస్ట్‌గార్డ్ (ICG)లోకి మొట్టమొదటి స్వదేశీ ఎయిర్ కుషన్ వెహికల్ (ACV)
- గోవాలోని చౌగులే & కంపెనీ షిప్‌యార్డ్‌లో జూన్ 18న అధికారికంగా ప్రారంభోత్సవం
- ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మొత్తం 6 హోవర్‌క్రాఫ్ట్‌ల తయారీకి రక్షణ శాఖ ఒప్పందం
- సముద్ర జలాల్లో గస్తీ, భద్రత, అత్యవసర సేవల్లో మరింత పటిష్టంగా కోస్ట్‌గార్డ్
Indigenous Hovercraft India | త్రినేత్ర.న్యూస్ : భారత తీర రక్షణ దళం (Indian Coast Guard) సముద్ర జలాల్లో తమ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంది. ఆత్మనిర్భర్ భారత్ (Aatmanirbhar Bharat) విజన్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి ఎయిర్ కుషన్ వెహికల్ (Air Cushion Vehicle - ACV) 'H-561' ను గోవాలో దళంలోకి అధికారికంగా చేర్చారు. సముద్ర భద్రతలో ఇది ఒక కీలక ముందడుగుగా అధికారులు భావిస్తున్నారు.
గోవాలో ఘనంగా ప్రారంభోత్సవం
గోవాలోని చౌగులే & కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (Chowgule & Company) కు చెందిన రస్సాయీం ఫెసిలిటీలో ఈ ఇండక్షన్ కార్యక్రమం జరిగింది. భారతీయ తటరక్షక్ ఉన్నతాధికారులు, షిప్‌బిల్డింగ్ ఇండస్ట్రీ ప్రతినిధుల సమక్షంలో ఈ హోవర్‌క్రాఫ్ట్ సేవలను ప్రారంభించారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు.. చౌగులే కంపెనీ ICG కోసం మొత్తం ఆరు ACVలను నిర్మిస్తుండగా, అందులో సర్వీస్‌లోకి వచ్చిన మొదటి వెహికల్ ఇదే కావడం విశేషం.
#WATCH | The first indigenously constructed Air Cushion Vehicle (ACV), H-561, was inducted into service on 18 June 2026 at Chowgule & Company Private Limited, Goa. The induction ceremony was held at the shipyard's Rassaim facility in the presence of senior officials of Bharatiya… pic.twitter.com/K9j5KeN09n
— ANI (@ANI) June 18, 2026
ఎందుకిది అంత ప్రత్యేకం?
ఈ సరికొత్త హోవర్‌క్రాఫ్ట్ (Hovercraft) రాకతో ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఆపరేషనల్ పవర్ అమాంతం పెరగనుంది. సముద్రంలో ఎదురయ్యే సవాళ్లను, ముప్పులను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు, దైనందిన గస్తీ (Patrolling), సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఈ ఎయిర్ కుషన్ వెహికల్ అత్యంత కీలకంగా మారనుంది.
Indian Coast Guard (ICG) inducted first of the six indigenous Air Cushion Vehicles (ACVs), being constructed by Chowgule & Company Private Limited in Goa on June 18, 2026. Its induction will further enhance ICG’s operational effectiveness, response to emerging challenges and the… pic.twitter.com/1tsVLW8XOn
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) June 18, 2026
దేశీయ రక్షణ రంగ తయారీ (Maritime industrial base) సామర్థ్యానికి ఈ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన ఉదాహరణ. సముద్ర జలాల్లో దేశ ప్రయోజనాలను కాపాడే క్రమంలో.. మారుతున్న కాలానికి అనుగుణంగా కోస్ట్‌గార్డ్‌ను మోడ్రనైజ్ చేయడంలో (Modernisation) ఈ స్వదేశీ హోవర్‌క్రాఫ్ట్‌ల ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tummala Nageshwar Rao | తొలకరి వర్షానికి తొందర పడకండి.. ఆగి విత్తనాలు పెట్టండి : మంత్రి తుమ్మల
- ●RRR Actress | ఆర్ఆర్ఆర్ చైల్డ్ యాక్టర్ ఎంతలా మారిపోయిందో చూశారా?
- ●Om Prakash Rajbhar | 2047 వరకూ అఖిలేష్ సీఎం కాలేరు.. యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- ●AI | డాక్టర్లను మించేసిన ఏఐ.. వైద్య రంగంలో కొత్త మైలురాయి..
- ●Shankar Son | హీరోగా ఎంట్రీ ఇస్తోన్న డైరెక్టర్ శంకర్ కొడుకు - సీక్రెట్‌గా డెబ్యూ మూవీ లాంఛ్ - హీరోయిన్ ఫిక్స్
- ●NEET | నీట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..

Tummala Nageshwar Rao | తొలకరి వర్షానికి తొందర పడకండి.. ఆగి విత్తనాలు పెట్టండి : మంత్రి తుమ్మల

RRR Actress | ఆర్ఆర్ఆర్ చైల్డ్ యాక్టర్ ఎంతలా మారిపోయిందో చూశారా?

Om Prakash Rajbhar | 2047 వరకూ అఖిలేష్ సీఎం కాలేరు.. యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

AI | డాక్టర్లను మించేసిన ఏఐ.. వైద్య రంగంలో కొత్త మైలురాయి..





