RS Praveen Kumar | నన్ను గుండోడా అంటే.. మందు గుండునై మీ గుండెల్లో నిద్రపోతా
RS Praveen Kumar | నన్ను గుండు, మతి లేదని ఎగతాళి చేస్తే ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెసోల్ల గుండెల్లో నిద్రపోతానని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. మీరు కూడా పొట్టిగా ఉన్నారని, అందుకే కుర్చీ ఎత్తులో వేసుకుంటున్నారని మేం అనగలమని ఎద్దేవా చేశారు.
- నిన్ను మేం పొట్టోడు అనగలం.. అందుకే కుర్చీ ఎత్తుగా వేసుకుంటున్నవ్
- బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై రేవంత్ సమాధానం చెప్పాలి
- జీవో 17 తెమ్మన్న వెధవెవడు?
- పిల్ల మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్‌కు తెలుసా?
- గుజరాత్, ఢిల్లీ సేట్ల కోసమే ఆ జీవో తెచ్చారు
- మీడియా సమావేశంలో కాంగ్రెస్ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజం
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్: నన్ను గుండు, మతి లేదని ఎగతాళి చేస్తే ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెసోల్ల గుండెల్లో నిద్రపోతానని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి బాడీ షేమింగ్ చేయడం కాదు, ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు కూడా పొట్టిగా ఉన్నారని, అందుకే కుర్చీ ఎత్తులో వేసుకుంటున్నారని మేం అనగలమని ఎద్దేవా చేశారు. జీవో 17 తీసుకురమ్మని చెప్పిన వెధవ ఎవడు? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం నాగర్‌కర్నూల్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గుజరాత్, ఢిల్లీ సేట్ల కోసమే జీవో నెం.17 తీసుకొచ్చారని ఆరోపించారు.

రమేష్ జైన్ అనే దొంగతో కలిసి..
వేల కోట్లు తినాలనే జీవో 17 తెచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మఫత్ లాల్ కోసమే తెచ్చారు. రేవంత్ రెడ్డి.. మీకు టెండర్లలో ఎంత వాటా కావాలో చెప్పండి. బడ్జెట్‌లో రేవంత్ వాటా కింద భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, జానా రెడ్డి కొడుకు.. రమేష్ జైన్ అనే దొంగతో కలిసి, గూడు పుఠానిగా కలిసి జీవో నెం 17 తయారు చేశారు. తెలంగాణ సొమ్మంతా ఇతర రాష్ట్రాలకు కట్టబెట్టే కుట్ర. చర్చకు సిద్ధం. అమరవీరుల స్థూపమైనా.. అంబేడ్కర్ విగ్రహం ముందైనా సరే.. లేదంటే ఎక్కడో మీరే చెప్పండి. ఆధారాలతో వస్తాం అని ఆర్ఎస్పీ సవాల్ విసిరారు.
అజారుద్ధీన్‌కు బ్యాటింగ్, బౌలింగ్ తప్ప ఏం తెలుసు?
మేం రూ.2 వేల కోట్లు కుంభకోణం అంటున్నాం. కాకుంటే ఎన్ని కోట్లు కుంభకోణం చేస్తున్నారో చెప్పండి. రూ.1500 కోట్లా లేదా రూ.1800 కోట్లా చెప్పండి. మఫత్ లాల్ కోసం జీవో నెం 17 తెచ్చారని పిల్ల మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌కు తెలుసా? అజారుద్దీన్‌కు బ్యాటింగ్, బౌలింగ్ తప్ప ఏం తెలుసు. మఫత్ లాల్‌నే మంత్రిని చేయండి. మఫత్ లాల్ కేవలం యూనిఫాం డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. ఎక్కడికి రావాలి? ఎప్పుడు రావాలో మంత్రి లక్ష్మణ్ చెప్పాలి. ఆధారాలతో రావడానికి సిద్ధం. జీవో 17 నోట్ ఫైల్ ప్రజల ముందు పెట్టండి అని ఆయన డిమాండ్ చేశారు.
టెండర్ డాక్యుమెంట్‌లో ఎందుకు పెట్టలే..
ఒక గ్లాస్ విలువ 10 రూ. అయితే.. మొత్తం లక్ష గ్లాసులకు ఇంత ఖర్చు అవుతుందని టెండర్ డాక్యుమెంట్‌లో ఎందుకు పెట్టలేదు? ప్లేట్ విలువ ఒకటి రూ.25 అయితే 10 లక్షల ప్లేట్లు కొంటే ఎంత ఖర్చవుతుందో టెండర్ డాక్యుమెంట్‌లో రాయిడి. ఒక పక్క చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే.. మీరేమో ఢిల్లీ సేట్లకు కట్టబెడుతున్నారు. గుండు చేసుకున్నానని.. మతి లేదని, బండ అని ఎగతాళి చేసినా నేను మందు గుండునై మీ గుండెల్లో, కాంగ్రెసోల్ల గుండెల్లో నిద్ర పోత అని హెచ్చరించారు.
పట్టపగలే మోసం చేస్తున్నరు..
మీరు పట్టపగలే తెలంగాణను మోసం చేస్తున్నారు. చింతామణి రమేష్ జైన్ అనే కంపెనికి ఎలా కావాలంటే అలా రూల్స్ మాట్లాడుతున్నారు. ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ అన్ని ముందే లీక్ చేస్తున్నారు. ఇది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ప్రకారం నేరం కాదా? కాంగ్రెసోల్లు పిల్లలకు ఇచ్చే గుడ్లు కూడా సరిగా ఇవ్వడం లేదు అని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana CAG Report 2026 | రేవంత్ సర్కార్ ‘ఆర్థిక మోసాలు’ బట్టబయలు: కాగ్ (CAG) రిపోర్టుతో కాంగ్రెస్ బండారం బయటపెట్టిన డాక్టర్ శ్రవణ్ దాసోజు
జూన్ 18, 2026

Harish Rao BRS | ఏపీకి నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లా? రేవంత్‌పై హరీశ్ ఫైర్
జూన్ 18, 2026

Telangana Crop Procurement | ఇది ‘పేపర్‌లెస్’ కాదు.. ‘ఫెయిత్లెస్’ క్యాబినెట్: రేవంత్ సర్కార్‌పై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు!
జూన్ 18, 2026
తాజావార్తలు
- ●Telangana CAG Report 2026 | రేవంత్ సర్కార్ 'ఆర్థిక మోసాలు' బట్టబయలు: కాగ్ (CAG) రిపోర్టుతో కాంగ్రెస్ బండారం బయటపెట్టిన డాక్టర్ శ్రవణ్ దాసోజు
- ●Harish Rao BRS | ఏపీకి నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లా? రేవంత్‌పై హరీశ్ ఫైర్
- ●Telangana Crop Procurement | ఇది 'పేపర్‌లెస్' కాదు.. 'ఫెయిత్లెస్' క్యాబినెట్: రేవంత్ సర్కార్‌పై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు!
- ●OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ 'క్లైమేట్ స్మార్ట్' ప్లాన్!

Telangana CAG Report 2026 | రేవంత్ సర్కార్ 'ఆర్థిక మోసాలు' బట్టబయలు: కాగ్ (CAG) రిపోర్టుతో కాంగ్రెస్ బండారం బయటపెట్టిన డాక్టర్ శ్రవణ్ దాసోజు

Harish Rao BRS | ఏపీకి నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లా? రేవంత్‌పై హరీశ్ ఫైర్

Telangana Crop Procurement | ఇది 'పేపర్‌లెస్' కాదు.. 'ఫెయిత్లెస్' క్యాబినెట్: రేవంత్ సర్కార్‌పై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు!

OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం



