త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adulterated Paneer Hyderabad | హైదరాబాద్‌లో భారీ కల్తీ పనీర్ దందా బట్టబయలు.. ‘ఫ్రెష్ పనీర్’ ముసుగులో ప్రాణాలతో చెలగాటం

హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో 825 కిలోల కల్తీ పనీర్ పట్టుబడింది. 'ఫ్రెష్ పనీర్' పేరుతో సింథటిక్ పాలు, రసాయనాలతో తయారైన నకిలీ పనీర్‌ విక్రయాలు.

J

Hyderabad | Published On Jun 18, 2026, 4.12 pm IST

Adulterated Paneer Hyderabad | హైదరాబాద్‌లో భారీ కల్తీ పనీర్ దందా బట్టబయలు..  ‘ఫ్రెష్ పనీర్’ ముసుగులో ప్రాణాలతో చెలగాటం
Advertisement
  • హైదరాబాద్‌లోని 45 ఫుడ్ అవుట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు
  • స్టార్చ్, సింథటిక్ పాలు, ప్రమాదకర రసాయనాలతో తయారు చేసిన 825 కిలోల నకిలీ పనీర్ సీజ్
  • కనీస ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ లేకుండా 'చీజ్ అనలాగ్'ను పనీర్‌గా విక్రయిస్తూ ప్రజలకు టోకరా
  • ఈ కల్తీ పనీర్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ ముప్పు ఉందని డీసీపీ వైభవ్ గైక్వాడ్ హెచ్చరిక

Adulterated Paneer Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో మరో భారీ కల్తీ బాగోతం వెలుగుచూసింది. మనం ఎంతో ఇష్టంగా, ఆరోగ్యానికి మంచిదని తినే పనీర్ వెనుక ఉన్న చీకటి కోణం బయటపడింది. నగరంలో టాస్క్‌ఫోర్స్ (Task Force) అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో ఏకంగా 825 కిలోల కల్తీ పనీర్ పట్టుబడింది. 'లో ఫ్యాట్', 'ఫ్రెష్ పనీర్' లేబుల్స్‌తో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న భారీ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు.

ఎక్కడెక్కడ దాడులు జరిగాయంటే..

నగర వ్యాప్తంగా సుమారు 45 ఫుడ్ అవుట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లపై అధికారులు ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం స్థానికంగానే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ నకిలీ పనీర్ హైదరాబాద్‌కు భారీగా సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Massive Fake Paneer Racket Busted in Hyderabad 825 Kg Seized

అసలు ఇందులో ఏముంది?

ఈ కల్తీ పనీర్‌ను ఎలా తయారు చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిజమైన పాలకు బదులుగా నాణ్యతలేని సింథటిక్ పాలు (Synthetic milk), స్టార్చ్ (Starch పిండిపదార్థాలు), నాన్-మిల్క్ ఫ్యాట్స్, ప్రమాదకరమైన రసాయనాలను కలిపి దీనిని తయారు చేస్తున్నారు. దీనికి ఎలాంటి FSSAI లైసెన్సులు లేవు. మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ఎక్స్‌పైరీ డేట్ వివరాలు లేకుండానే ఈ "చీజ్ అనలాగ్" (Cheese analogue) మార్కెట్లోకి గుట్టుచప్పుడు కాకుండా వచ్చేస్తోంది.

అధికారుల హెచ్చరికలు

ఈ నకిలీ పనీర్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ (Food poisoning), తీవ్రమైన అలర్జీలు, ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.

వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, కేవలం లైసెన్స్ ఉన్న నమ్మకమైన వ్యాపారుల వద్దే, సరైన ప్యాకేజింగ్ చూసి పనీర్ కొనుగోలు చేయాలని పోలీసులు సూచించారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని డీసీపీ వైభవ్ గైక్వాడ్ కఠినంగా హెచ్చరించారు.

Advertisement
Advertisement