త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rayadurgam Land Auction | రాయదుర్గం ఎస్‌బీఐ భూముల వేలంపై హైకోర్టు స్టే

హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో రూ.237 కోట్లకు ఎకరం చొప్పున ప్రభుత్వం ఆక్షన్ వేసిన భూమిపై వివాదం! ఆ 5 ఎకరాలు తమవేనంటూ SBI హైకోర్టును ఆశ్రయించడంతో వేలంపై స్టే.

J

Hyderabad | Published On Jun 18, 2026, 6.30 pm IST

Rayadurgam Land Auction | రాయదుర్గం ఎస్‌బీఐ భూముల వేలంపై హైకోర్టు స్టే

సంక్షిప్త సారాంశం

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో టీజీఐఐసీ (TGIIC) భూముల వేలంపై హైకోర్టు మూడు వారాల స్టే విధించింది. ఇటీవల రికార్డు స్థాయిలో ఎకరం రూ.237 కోట్లకు సర్వే నంబర్ 83/1 లోని భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం విక్రయించింది. ఆ భూమిలోని 5 ఎకరాలు 2010లోనే తాము కొనుగోలు చేశామని ఎస్బీఐ (SBI) కోర్టును ఆశ్రయించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని టీజీఐఐసీ, ఎస్బీఐ, గౌరా వెంచర్స్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

Advertisement
  • తమ ల్యాండ్ అమ్మేశారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎస్‌బీఐ

Rayadurgam Land Auction | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Hyderabad Real Estate) చరిత్రలోనే రికార్డు ధర పలికిన రాయదుర్గం భూముల వేలం వివాదంలో చిక్కుకుంది. నాలెడ్జ్ సిటీ (Knowledge City) పరిధిలో ప్రభుత్వం ఇటీవల ఆక్షన్ వేసిన స్థలంలో.. 5 ఎకరాల భూమి తమదేనంటూ ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం వేలం ప్రక్రియపై మూడు వారాల పాటు స్టే విధించింది.

అసలేం జరిగిందంటే?

గత నెల 28న రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1 లో ఉన్న టీజీఐఐసీ (TGIIC) భూములను ఆక్షన్ (Auction) ద్వారా విక్రయించింది. ఈ వేలంలో ఎకరం స్థలం ఏకంగా రూ.237 కోట్ల రికార్డు ధర పలికింది. అయితే, ప్రభుత్వం విక్రయించిన ఈ ఖరీదైన భూమిలో 5 ఎకరాలు తమవేనని, దీనిపై వెంటనే రిట్ ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ SBI కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

2010లోనే కొనుగోలు చేశాం

తాము ఆ ఐదెకరాల స్థలాన్ని 2010లోనే సుమారు రూ.13 కోట్లకు కొనుగోలు చేశామని, ఇప్పుడు తమకు ఎలాంటి సమాచారం లేకుండా టీజీఐఐసీ ఆ భూములను ఎలా వేలం వేస్తుందని ఎస్బీఐ వాదిస్తోంది. ఈ వ్యవహారంతో ఏకంగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు భూమికే తెలంగాణలో రక్షణ కరువైందా అనే చర్చ నెట్టింట మొదలైంది.

Image

కౌంటర్ దాఖలుకు ఆదేశాలు

ఈ పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు (Telangana High Court) భూముల వేలం ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తూ స్టే విధించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎస్‌బీఐ, టీజీఐఐసీతో పాటు భూమి దక్కించుకున్న గౌరా వెంచర్స్ (Gowra Ventures) సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Image

Advertisement
Advertisement