Suhasini Mulay | అరవై ఏళ్ల వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి – ఫేస్‌బుక్ ద్వారా లవ్‌స్టోరీ మొదలు
బాలీవుడ్ నటి సుహాసిని ములే అరవై ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకుంది. ఓ సైంటిస్ట్‌ను పెళ్లి చేసుకుంది. హిందీలో లగాన్, జోదా అక్బర్‌తో పాటు ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసింది సుహసిని. మూడు నేషనల్ అవార్డులు అందుకుంది.
Entertainment | Published On Jun 18, 2026, 6.08 pm IST
Suhasini Mulay | బాలీవుడ్ నటి సుహాసిని ములే అరవై ఏళ్ల వయసులో పెళ్లి పీటలు ఎక్కింది. సైంటిస్ట్ అతుల్‌తో ఏడడుగులు వేసింది. 1969లో వచ్చిన భువన్ షోమ్ మూవీతో హిందీ ఇండస్ట్రీలో తొలి అడుగు వేసింది. హు తూతూ సినిమాతో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకుంది. 13 బీ, జోదా అక్బర్, లగాన్, హమ్ కౌన్ హై, పేజ్ 3తో పాటు పలు విజయవంతమైన సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది సుహాసిని.
సింగిల్‌గా...
అరవై ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్న సుహాసిని ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అందులోనూ ప్రేమ వివాహం చేసుకొని అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. తన లవ్‌స్టోరీపై ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది సుహాసిని. పెళ్లి విషయంలో తనకంటూ కొన్ని నిర్ధిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని, తను కోరుకున్న లక్షణాలున్న అబ్బాయి అరవై ఏళ్ల వయసు వరకు కనిపించలేదని సుహాసిని చెప్పింది. అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానని అన్నది.
75 రోజుల్లోనే పెళ్లి...
"సోషల్ మీడియాపై తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని, ఓ స్నేహితురాలి బలవంతంతో ఫేస్‌బుక్‌లో ఖాతాను క్రియేట్ చేశా. అదే నా జీవితాన్ని మలుపుతిప్పింది. ఫేస్‌బుక్ ద్వారానే అతుల్ పరిచయం అయ్యాడు. సైంటిస్ట్‌గా అతడి ప్రొఫైల్ కనిపించింది. నాకు సైన్స్ అంటే ఇష్టం ఉండటంతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా. అతడు యాక్సెప్ట్ చేశాడు. సైన్స్ గురించి మాట్లాడుకోవడంతో మొదలైన మా సాన్నిహిత్యం పర్సనల్ విషయాలు షేర్ చేసుకునే వరకు వచ్చిందంటూ తన లవ్‌స్టోరీ గురించి వెల్లడించింది. అతుల్ పరిచయమైన 75 రోజుల్లోనే అతడితో పెళ్లికి ఓకే చెప్పా" అని సుహాసిని ములే అన్నది. సుహాసిని ములే ఇప్పటివరకు మూడు నేషనల్ అవార్డులు అందుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kangana Ranaut | కంగనా రనౌత్ మూవీకి ఓ టికెట్ కొంటే మరోటి ఫ్రీ – బీజేపీ ఎంపీ మూవీని పట్టించుకోని ఆడియెన్స్
జూన్ 13, 2026

Salman Khan | కృష్ణ జింకల వేట కేసుపై సినిమా – కోర్టును ఆశ్రయించిన సల్మాన్ ఖాన్
జూన్ 12, 2026

Mrunal Thakur | బోల్డ్ సీన్లపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ – అందుకే ఆ సినిమా చేశానంటూ కామెంట్స్
మే 25, 2026
తాజావార్తలు
- ●Hisense E8S | హైసెన్స్ కొత్త ఈ8ఎస్ మినీ-ఎల్ఈడీ టీవీలు.. 144హెడ్జ్ గేమింగ్‌తో అదిరిపోయిన ఫీచర్లు..
- ●Indigenous Hovercraft India | సముద్ర జలాల్లో మరింత పటిష్టంగా ఇండియన్ కోస్ట్‌గార్డ్.. తొలి స్వదేశీ 'హోవర్‌క్రాఫ్ట్' ఎంట్రీ!
- ●TGPSC | డైట్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ●Tummala Nageshwar Rao | తొలకరి వర్షానికి తొందర పడకండి.. ఆగి విత్తనాలు పెట్టండి : మంత్రి తుమ్మల
- ●RRR Actress | ఆర్ఆర్ఆర్ చైల్డ్ యాక్టర్ ఎంతలా మారిపోయిందో చూశారా?
- ●Om Prakash Rajbhar | 2047 వరకూ అఖిలేష్ సీఎం కాలేరు.. యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Hisense E8S | హైసెన్స్ కొత్త ఈ8ఎస్ మినీ-ఎల్ఈడీ టీవీలు.. 144హెడ్జ్ గేమింగ్‌తో అదిరిపోయిన ఫీచర్లు..

Indigenous Hovercraft India | సముద్ర జలాల్లో మరింత పటిష్టంగా ఇండియన్ కోస్ట్‌గార్డ్.. తొలి స్వదేశీ 'హోవర్‌క్రాఫ్ట్' ఎంట్రీ!

TGPSC | డైట్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Tummala Nageshwar Rao | తొలకరి వర్షానికి తొందర పడకండి.. ఆగి విత్తనాలు పెట్టండి : మంత్రి తుమ్మల



