LPG shortage | లాక్‌డౌన్‌ను గుర్తు చేస్తున్న ఎల్పీజీ కొరత.. ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్న కార్మికులు
LPG shortage | పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారతీయుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఇరాన్ యుద్ధం (Iran War) కరోనా లాక్‌డౌన్‌ను (Corona Lockdown) గుర్తు చేస్తోంది.
LPG shortage | పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారతీయుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఇరాన్ యుద్ధం (Iran War) కరోనా లాక్‌డౌన్‌ను (Corona Lockdown) గుర్తు చేస్తోంది. ఈ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత (LPG shortage) తలెత్తింది. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పీజీలు మూతపడుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి.
యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లపై (Commercial Gas Cylinder) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హాస్పిటళ్లు, గృహావసరాలకు ప్రాధాన్యమివ్వాలని చమురు కంపెనీలకు స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా రెస్టారెంట్లు, హోటల్స్ మూతపడ్డాయి. అందులో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమీ లేక సొంతూళ్ల బాటపడుతున్నారు. "కరోనా సమయంలో ఎలాగైతే పనిలేక ఇంటికి వెళ్ళామో.. ఇప్పుడు గ్యాస్ లేక మళ్లీ అదే పరిస్థితి వస్తోంది" అని నోయిడాలోని ఒక రెస్టారెంట్ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
గ్యాస్ బుకింగ్ సిస్టమ్ క్రాష్.. ఏజెన్సీల వద్ద ప్రజలు క్యూ..
మరోవైపు గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులూ లేవని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేగా ఉంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెబుతున్నా సామాన్యులు మాత్రం గ్యాస్ దొరకదేమో అన్న భయంతో ముందస్తుగానే బుక్ చేసుకుంటున్నారు. దీంతో గ్యాస్ బుకింగ్ సిస్టమ్ కూడా క్రాష్ అవుతోంది. మరి కొందరైతే ఏకంగా గ్యాస్ ఏజెన్సీల వద్దకే పరుగులు తీస్తున్నారు. గంటల తరబడి సిలిండర్లతో క్యూలో నిల్చుంటున్నారు. దీంతో ప్రధాన నగరాల్లో కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి.
https://x.com/ANI/status/2031979760310759746
దోచుకుంటున్న వ్యాపారులు..
మరోవైపు ఇదే ఆసరగా కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. సిలిండర్లను అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్‌ను అక్రమంగా హోటళ్లకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా సామాన్యులకు కూడా వంట గ్యాస్ దొరకడం గగనమైపోయింది. ప్రస్తుతం రూ.1,000 ఉండాల్సిన సిలిండర్ ధర ఏకంగా రూ.5వేల వరకూ చేరినట్లు తెలుస్తోంది.
https://x.com/ANI/status/2031969307811594453
కుప్పకూలిన హోటల్ రంగం..
ఈ గ్యాస్ కొరత కారణంగా హోటల్ రంగం కుప్పకూలుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో చాలా హోటల్స్ మూతపడ్డాయి. కొన్ని మాత్రం ధరలను భారీగా పెంచాయి. టీ, సమోసా వంటి చిరుతిళ్ల ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని హోటల్స్ అయితే, పాతపద్ధతిలో కట్టెల పొయ్యిల వైపు మొగ్గుచూపుతున్నాయి. మరికొందరు ఇండక్షన్ స్టవ్స్‌ను యూజ్ చేస్తూ హోటల్స్‌ను రన్ చేస్తున్నారు.
https://x.com/ANI/status/2031938972025602441
ఉపాధి కోల్పోతున్న గిగ్ వర్కర్లు..
ఇక హోటల్స్ మూతపడటంతో ఆన్‌లైడ్ ఫుడ్ డెలివరీలు తగ్గిపోయాయి. ఎల్పీజీ సంక్షోభం కారణంగా పలు నగరాల్లో డెలివరీల సంఖ్య 50 నుంచి 60 శాతం వరకూ పడిపోయింది. దీంతో గిగ్ వర్కర్లు ఉపాధి కోల్పోతున్నారు. గిగ్ వర్కర్లు తీవ్రంగా నష్టపోతున్నారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గిగ్ వర్కర్స్‌తోపాటూ హోటల్స్‌లో పనిచేస్తున్న కార్మికులు కూడా ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి. హోటల్స్ మూతపడటంతో వారి పరిస్థితి మరింత దిగజారింది. ఏం చేయాలో తెలియక వారు ఉపాధిని వెతుక్కుంటూ సొంతూళ్ల బాటపడుతున్నారు.
లాక్‌డౌన్ రోజులు గుర్తుకు వస్తున్నాయి..
ఎల్పీజీ సంక్షోభంపై పలువురు వ్యాపారులు, సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్పీజీ సంక్షోభం కొవిడ్ లాక్‌డౌన్‌ను గుర్తు చేస్తోంది. ఆ రోజుల్లో కనీసం ఆహారమైనా దొరికేది. కానీ ఇప్పుడు అదే ఇబ్బందిగా మారింది. కరోనా, లాక్‌డౌన్, నోట్ల రద్దు.. ఇలాంటి కష్టాలన్నీ సామాన్యులకే అనిపిస్తోంది అంటూ నోయిడా సెక్టార్‌కు చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
https://x.com/ANI/status/2031945160477851981
Also Read..
Commercial Gas Cylinder | రూ.4000.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరకు రెక్కలు..
Farooq Abdullah | ఆ దేవుడే నన్ను రక్షించాడు.. హత్యాయత్నం ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



