త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Aviation Industry | ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్‌.. విమానయాన రంగానికి రూ.38 వేల కోట్ల నష్టాలు..

Indian Aviation Industry | ఇరాన్‌ యుద్ధం ప్రభావం, రూపాయి విలువ పతనం, విమాన ఇంధన ధరల పెరుగుదలతో భారత విమానయాన రంగం నష్టాలు భారీగా పెరగనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.28వేల నుంచి రూ.30వేల కోట్లుగా ఉన్న నష్టాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.36వేల నుంచి రూ.38వేల కోట్లకు చేరుతాయ‌ని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది.

S

Business | Published On Oct 29, 2026, 2.43 pm IST

Indian Aviation Industry | ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్‌.. విమానయాన రంగానికి రూ.38 వేల కోట్ల నష్టాలు..
Advertisement

Indian Aviation Industry | ఇరాన్‌ యుద్ధం ప్రభావం, రూపాయి విలువ పతనం, విమాన ఇంధన ధరల పెరుగుదలతో భారత విమానయాన రంగం నష్టాలు భారీగా పెరగనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.28వేల నుంచి రూ.30వేల కోట్లుగా ఉన్న నష్టాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.36వేల నుంచి రూ.38వేల కోట్లకు చేరుతాయ‌ని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది.

భారత విమానయాన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణికుల రాకపోకల వృద్ధి మందగించడం, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరలు పెరగడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం వంటి పరిణామాలు విమానయాన సంస్థల ఆదాయంపై ప్రభావం చూపనున్నాయి. ఈ కారణాలతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.28వేలు-రూ.30వేల కోట్లుగా నమోదైన నికర నష్టాలు, ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.36వేలు-రూ.38వేల‌ కోట్లకు పెరుగుతాయ‌ని ఇక్రా నివేదికను ఉటంకిస్తూ పీటీఐ వెల్లడించింది.

నష్టాలకు ప్రధాన కారణాలివే..

ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం ప్రభావం 2026-27 ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికుల వృద్ధిని మందగింపజేస్తుంద‌ని ఇక్రా పేర్కొంది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇంధన ధరలు అధిక స్థాయిలో కొనసాగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడంతో విదేశీ మారక ద్రవ్య నష్టాలు పెరగడం విమానయాన సంస్థలకు భారంగా మారనున్నాయి. దీనికి తోడు కొత్త విమానాల డెలివరీలు కొనసాగుతుండడంతో లీజు అద్దెల వ్యయం కూడా పెరుగుతోంది. ఈ పరిణామాలన్నీ సంస్థల నిర్వహణ ఖర్చులను మరింత పెంచనున్నాయి.

ప్రయాణికులపై భారం పడుతుందా?

పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు టికెట్‌ ధరలను పెంచే అవకాశం ఉన్నప్పటికీ, ఆ భారాన్ని పూర్తిగా ప్రయాణికులపైకి బదిలీ చేయడం సాధ్యం కాద‌ని ఇక్రా అంచనా వేసింది. టికెట్‌ ధరలు పెంచితే ప్రయాణికుల డిమాండ్‌పై ప్రభావం పడే అవకాశం ఉండడంతో సంస్థలకు ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత సాధించడం సవాలుగా మారనుంది. యుద్ధ పరిణామాలు, రూపాయి మారకం విలువ, విమాన ఇంధన ధరలు రానున్న నెలల్లో ఎలా మారతాయన్నది భారత విమానయాన రంగం ఆర్థిక పరిస్థితిని నిర్ణయించనుంది.

Advertisement
Advertisement