Commercial Gas Cylinder | రూ.4000.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరకు రెక్కలు..
Commercial Gas Cylinder | కమర్షియల్ సిలిండర్లపై (Commercial Gas Cylinder) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హాస్పిటళ్లు, గృహావసరాలకు ప్రాధాన్యమివ్వాలని చమురు కంపెనీలకు స్పష్టం చేసింది.
Commercial Gas Cylinder | త్రినేత్ర.న్యూస్: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్మూజ్ కాలువను ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లపై (Commercial Gas Cylinder) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హాస్పిటళ్లు, గృహావసరాలకు ప్రాధాన్యమివ్వాలని చమురు కంపెనీలకు స్పష్టం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. హైదరాబాద్‌లోనూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. ఒకవేళ దొరికినా రెంట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు.
ప్రస్తుతం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2105గా ఉన్నది. అయితే కొరతను అదనుగా తీసుకున్న పలువురు రూ. 4 వేలు, రూ.3,500కు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో పెద్ద సంఖ్యలో హోటళ్లు మూతపడుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి హోటల్‌ను బుధవారం మూసేశారు. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగానే మూసేసిన్నట్లుగా తెలిసింది.
అదేవిధంగా ప్రముఖ ప్యారడైజ్ హోటల్స్ అన్ని బ్రాంచీలలో చాయ్ అమ్మకాలను నిలిపివేశారు. ఐటీసీ సంస్థ కూడా వివిధ ప్రాంతాల్లో గల సంస్థ హోటల్స్‌లో గ్యాస్ కొరత కారణంగా లంచ్, డిన్నర్ ఉండదని ప్రకటించింది. ఐటీ కారిడార్‌లో ఇప్పటికే చాయ్, కాఫీలను బ్యాన్ చేశారు. గ్యాస్‌ను ఎక్కువగా తీసుకునే వడ, దోశ, పూరీలపై కూడా నిషేధం విధించారు. పలు హాస్టళ్లలో అన్నం, పప్పు, రసం మాత్రమే వడ్డిస్తున్నారు. ఇక నగరంలో చాలా చిన్నచిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. దీంతో ఫుడ్ డెలివరీలు చేసుకునే గిగ్‌వర్కర్లు రోడ్డున పడుతున్నారు.
సంబంధిత వార్తలు

LPG Cylinder Price | గ్యాస్ బండ.. భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర..
మే 1, 2026

West Asia | ఏప్రిల్ 6 వరకు ఇరాన్‌కు డెడ్‌లైన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
మార్చి 27, 2026

Kashmir donations to Iran | నగదు నుంచి బంగారం వరకు.. యుద్ధంలో నష్టపోయిన ఇరాన్‌కు కశ్మీరీల భారీ విరాళాలు.. “థ్యాంక్యు ఇండియా” అన్న ఇరాన్!
మార్చి 23, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



