Donald Trump | 10 నిమిషాల్లో ఇరాన్ అణు స్థావరాలను నాశనం చేస్తాం : ట్రంప్
Donald Trump | ఇరాన్ (Iran) అణుకేంద్రాలను దాదాపు ధ్వంసం చేశామని.. ఇంకా మిగిలి ఉన్న ఒకటి రెండు అణు కేంద్రాలను కేవలం 10 నిమిషాల్లోనే నాశనం చేసే సత్తా తమ సైన్యానికి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టం చేశారు.
International | Published On Nov 1, 2026, 12.13 pm IST
Donald Trump | త్రినేత్ర న్యూస్ : ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ అణుకేంద్రాలను దాదాపు ధ్వంసం చేశామని చెప్పారు. ఇంకా మిగిలి ఉన్న ఒకటి రెండు అణు కేంద్రాలను కేవలం 10 నిమిషాల్లోనే నాశనం చేసే సత్తా తమ సైన్యానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇరాన్‌కు చెందిన అణు కేంద్రాలను దాదాపు ధ్వంసం చేశాం. నౌకాదళం, వాయుసేన, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ నెట్‌వర్క్, రక్షణ పరికరాల తయారీ విభాగాలను నాశనం చేశాం. భూగర్భంలో అత్యంత భద్రంగా ఉండే 'పిక్-యాక్స్ మౌంటైన్' వంటి ప్రధాన కేంద్రాలు సహా ఒకటి రెండు అణు స్థావరాలు మాత్రమే ఇప్పటికీ ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంది. వాటిని కూడా తుడిచిపెట్టడానికి మా సైన్యానికి ఎక్కువ సమయం పట్టదు. ఆదేశాలు ఇచ్చిన 10 నిమిషాల్లోనే సైన్యం ఆ పని పూర్తి చేయగలదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతానికి తదుపరి దాడులు చేయడానికి తమకేమీ అంత తొందర లేదని చెప్పారు. అదేసమయంలో ఇరాన్‌తో చర్చలు బాగానే సాగుతున్నాయని వెల్లడించారు. అయితే, ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత వెనక్కి తగ్గడం ఇరాన్‌కు అలవాటని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ దేశాన్ని నమ్మడానికి లేదన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దేశాలు తమపై ఏ విధంగా, ఏ స్థాయి దాడికి పాల్పడినా అందుకు దీటైన సమాధానం ఇవ్వాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) తన సేనలను ఆదేశించిన నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ తాజా హెచ్చరికలు రావడం గమనార్హం.
Also Read..
నేపాల్‌లో భారీ హిమపాతం.. ఆరుగురు భారతీయ పర్యాటకులు గల్లంతు
ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Priyanka Chopra | అమెరికాలో ప్రియాంక చోప్రా దీపావళి వేడుకలు – ఫొటోలు చూశారా?
అక్టోబర్ 31, 2026

Indian Aviation Industry | ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. విమానయాన రంగానికి రూ.38 వేల కోట్ల నష్టాలు..
అక్టోబర్ 29, 2026

Lula da Silva | బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి.. మరోసారి అధికారంలోకి లూలా డా సిల్వా
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●INDIA Bloc Vs BJP | ఢిల్లీలో రాజకీయ వేడి.. బీజేపీ, ఇండీ కూటమి పోటాపోటీ ర్యాలీలు.. రాజధానిలో 10 వేల మంది పోలీసులు మోహరింపు
- ●Nepal | నేపాల్‌లో భారీ హిమపాతం.. ఆరుగురు భారతీయ పర్యాటకులు గల్లంతు
- ●Gas Cylinder Price | దీపావళి పండుగ వేళ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- ●Vikarabad | ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి..
- ●November Horoscope 2026 | నవంబర్‌లో సూర్యుడి సంచారం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే!
- ●Municipal Elections | ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

INDIA Bloc Vs BJP | ఢిల్లీలో రాజకీయ వేడి.. బీజేపీ, ఇండీ కూటమి పోటాపోటీ ర్యాలీలు.. రాజధానిలో 10 వేల మంది పోలీసులు మోహరింపు

Nepal | నేపాల్‌లో భారీ హిమపాతం.. ఆరుగురు భారతీయ పర్యాటకులు గల్లంతు

Gas Cylinder Price | దీపావళి పండుగ వేళ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

Vikarabad | ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి..



