Farooq Abdullah | ఆ దేవుడే నన్ను రక్షించాడు.. హత్యాయత్నం ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా
Farooq Abdullah | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah)పై హత్యాయత్నం (Assassination Attempt) కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా తాజాగా తొలిసారి స్పందించారు.
Farooq Abdullah | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah)పై హత్యాయత్నం (Assassination Attempt) కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా తాజాగా తొలిసారి స్పందించారు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని, ఆ దేవుడే తనను రక్షించాడని పేర్కొన్నారు. తనపై దాడికి ప్రయత్నించిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకుని బంధించినట్లు తెలిపారు. "నేను క్షేమంగా ఉన్నాను. ఆ దేవుడే నన్ను రక్షించాడు. దాడి చేసేందుకు ఆ వ్యక్తి సరిగ్గా నా వెనుక వైపుకు వచ్చాడు. చివరి నిమిషంలో భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని బంధించారు. వెంటనే నన్ను కారులోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు" అని ఫరూఖ్ అబ్దుల్లా వివరించారు.
"నిందితుడి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. ఈ ఘటనను భద్రతా వైఫల్యం (Security lapse) అని ఇప్పుడే చెప్పడం చాలా పెద్ద తప్పు అవుతుంది. ఆ వివాహ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు వచ్చారు. కానీ అక్కడ కనీసం ఒక్క పోలీసు కూడా లేరు. ఆ అల్లా దయ వల్ల నా భద్రతా సిబ్బంది నా వెంటే ఉండటం వల్ల ప్రాణాలు దక్కాయి" అని ఫరూఖ్ అబ్దుల్లా తెలిపారు. ఈ ఘటన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
బుధవారం రాత్రి ఆయన జమ్ములోని గ్రేటర్ కైలాష్‌లో (Greater Kailash) ఉన్న రాయల్ పార్క్‌లో జరిగిన ఒక పెండ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. జనంలో నుంచి వచ్చిన ఓ దుండగుడు అబ్దుల్లాపై పాయింట్ బ్లాక్‌లో పిస్టల్‌తో కాల్చేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన నేషల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) కమాండోలు దుండగుడిని వెనక్కి నెట్టేశారు. ఆలోపే ఒక రౌండ్ కాల్పులు జరిపాడు.
అయితే ఫరూక్ అబ్దుల్లాకు గానీ, ఆయన వెంటే ఉన్న ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరికి గానీ ఎలాంటి గాయాలూ కాలేదని పోలీసులు తెలిపారు. దుండగుడిని జమ్ములోని పురానీ మండీకి చెందిన కమల్‌సింగ్‌గా గుర్తించామన్నారు. మైనింగ్ వ్యాపారి అయిన అతడు ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నాడని చెప్పారు. కాగా, గత 20 ఏండ్లుగా దీనికోసమే ఎదురుచూస్తున్నట్లు నిందితుడు తెలిపాడు.
https://x.com/iamnarendranath/status/2031793795621404797
Also Read..
Om Birla | మళ్లీ స్పీకర్ స్థానాన్ని అధిష్టించిన ఓం బిర్లా
Iran Conditions | ఇరాన్ కీలక ప్రకటన.. యుద్ధం ముగింపునకు మూడు షరతులు
Indian Oil Tankers | బిగ్ రిలీఫ్.. హర్మూజ్ గుండా భారత నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతి
సంబంధిత వార్తలు

Bus Overturns | కొండపై నుంచి లోయలో పడిన బస్సు.. 16 మంది మృతి
ఏప్రిల్ 20, 2026

Tricolour Ribbon | ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి మువ్వన్నెల రిబ్బన్.. కట్‌చేసేది లేదన్న సీఎం..
ఏప్రిల్ 16, 2026

Charity Scam | ఇరాన్ వార్ పేరుతో భారీ స్కామ్.. ఛారిటీ ముసుగులో దేశవ్యతిరేక శక్తుల కోసం నిధుల సేకరణ..!
మార్చి 26, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



