త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chinna Reddy | బీఫాం వెనక్కి తీసుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. చిన్నారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Chinna Reddy | కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు జీ. చిన్నారెడ్డి (Chinna Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

G

Telangana | Published On Mar 12, 2026, 11.33 am IST

Chinna Reddy | బీఫాం వెనక్కి తీసుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. చిన్నారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Chinna Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు జీ. చిన్నారెడ్డి (Chinna Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మయంలో త‌న‌కు వ‌న‌ప‌ర్తి బీఫాం ఇచ్చిన పార్టీ అధిష్ఠానం దానిని తిరిగి తీసుకున్న‌ద‌ని, ఆ స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకున్నాన‌ని చెప్పారు. క‌ష్ట‌కాలంలో ప‌నిచేసిన కార్య‌క‌ర్తల‌కు ప‌ద‌వులు ఇచ్చిన‌ప్పుడే పార్టీ నిల‌బ‌డుతుంద‌ని చెప్పారు.

‘నేను పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశా. శాసనసభ ఎన్నికల సమయంలో నాకు పార్టీ వనపర్తి భీపాం ఇచ్చి తిరిగి తీసుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. పిల్లలు గుర్తుకురావడంతో మానుకున్నా’ అని చిన్నారెడ్డి చెప్పారు. కష్టకాలంలో పనిచేసిన నిజమైన, నిఖార్సైన కార్యకర్తలకు పదవులు ఇచ్చినప్పుడే పార్టీ పదికాలాలపాటు అధికారంలో ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డి వర్గమని రెండు వర్గాలుండేవని, డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి అయినప్పటి నుంచి వర్గాల్లేవని, అందరూ కాంగ్రెస్‌ వర్గమేన‌ని చెప్పారు.

Advertisement
Advertisement