Wood Fire | వంటగదుల్లో ఇరాన్ మంటలు.. పెరుగుతున్న కట్టెలపొయ్యిల వినియోగం
Wood Fire | పశ్చిమాసియాలో యుద్ధం (Iran War ) చల్లారడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా దాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. ఇప్పుడు ఈ యుద్ధం సామాన్యుడి వంటగదిని తాకింది.
Wood Fire | పశ్చిమాసియాలో యుద్ధం (Iran War ) చల్లారడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా దాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. ఇప్పుడు ఈ యుద్ధం సామాన్యుడి వంటగదిని తాకింది. యుద్ధం కారణంగా పెట్రో ఉత్పత్తుల దిగుమతికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో దేశంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై (LPG Cylinder Shortage) ఆందోళన వ్యక్తమవుతోంది.
దేశంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై (LPG Cylinder Shortage) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించించిన విషయం తెలిసిందే. గృహావసరాలకు, అత్యవసర సేవలు అందించే దవాఖానలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని చమురు కంపెనీలకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. ఫలితంగా హోటల్, హాస్పిటాలిటీ రంగం అల్లాడిపోతోంది. కొన్ని చోట్ల ఇప్పటికే హోటల్స్ మూతపడ్డాయి. మరికొన్ని సంప్రదాయ వంట పద్ధతులను అనుసరిస్తున్నాయి. గ్యాస్‌కు బదులు కట్టెల పొయ్యిల (Wood Fire) వైపు మొగ్గుచూపుతున్నాయి.
ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో ప్రతీ హోటల్ హలీమ్‌ను తయారు చేసి విక్రయిస్తుంటుంది. అయితే, ఇందుకు గ్యాస్ ఖర్చు ఎక్కువ. ప్రస్తుతం ఎల్పీజీ దొరికే పరిస్థితి లేకపోవడంతో వారు వుడ్ ఫైర్‌పై ఆధారపడుతున్నారు. కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ షా ఘౌస్ సహా ప్రముఖ రెస్టారెంట్లు, హోటల్స్ వుడ్ ఫైర్‌కే మొగ్గు చూపుతున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లో కట్టెల పొయ్యిల వినియోగం పెరుగుతోంది.
మరోవైపు గ్యాస్ కొరత, నిత్యావసరాల ధరలు పెరగడంతో హోటళ్లు ధరలు పెంచాయి. దోస, పూరీ, వడలపై కనీసం రూ.15 వరకు పెరిగాయి. ఇడ్లీ, ఉప్మాలాంటి వాటిపై రూ.10 పెంచారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో 15 శాతం ధరలు పెంచారు. కాగా, వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోతే హోటల్ రంగం మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర హోటళ్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
https://x.com/jsuryareddy/status/2031603590083547148
Also Read..
Shiv Pratap Shukla | తెలంగాణ నూతన గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన శివ ప్రతాప్ శుక్లా
Xiaomi 17 | భారత్‌లో లాంచ్ అయిన షియోమీ 17 స్మార్ట్ ఫోన్.. పవర్‌ఫుల్ కెమెరాలు, భారీ బ్యాటరీ..
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



