త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shiv Pratap Shukla | తెలంగాణ నూత‌న గ‌వర్న‌ర్‌గా ప్ర‌మాణస్వీకారం చేసిన శివ ప్ర‌తాప్ శుక్లా

Shiv Pratap Shukla | తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్ (Telangana New Governor)గా శివ ప్ర‌తాప్ శుక్లా (Shiv Pratap Shukla) ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. లోక్‌భ‌వ‌న్ (Lok Bhavan)లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ చేత తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అప‌రేష్ కుమార్ సింగ్ ప్ర‌మాణం చేయించారు.

D

Telangana | Published On Mar 11, 2026, 1.01 pm IST

Shiv Pratap Shukla | తెలంగాణ నూత‌న గ‌వర్న‌ర్‌గా ప్ర‌మాణస్వీకారం చేసిన శివ ప్ర‌తాప్ శుక్లా
Advertisement

Shiv Pratap Shukla | తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్ (Telangana New Governor)గా శివ ప్ర‌తాప్ శుక్లా (Shiv Pratap Shukla) ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. లోక్‌భ‌వ‌న్ (Lok Bhavan)లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ చేత తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అప‌రేష్ కుమార్ సింగ్ ప్ర‌మాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, శాస‌న స‌భ స్పీక‌ర్ గడ్డం ప్ర‌సాద్‌, శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజ‌కీయ పార్టీల ముఖ్య నేత‌లు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

ఇటీవ‌లే ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద‌బోస్ (Ananda Bose) ఆక‌స్మిక రాజీనామాతో కేంద్ర ప్ర‌భుత్వం అనూహ్యంగా 9 రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న జిష్ణుదేవ్‌ను మ‌హారాష్ట్ర‌కు పంపించారు. ఆయ‌న స్థానంలో తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా శివ్‌ప్ర‌తాప్ శుక్లా (Shiv Pratap Shukla) నియ‌మితుల‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ (Himachal Pradesh) గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Also Read..

Xiaomi 17 | భార‌త్‌లో లాంచ్ అయిన షియోమీ 17 స్మార్ట్ ఫోన్‌.. ప‌వ‌ర్‌ఫుల్ కెమెరాలు, భారీ బ్యాట‌రీ..

Niranjan Reddy | ప్రజల తీర్పును కాలరాసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్: మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి

Kidneys | కిడ్నీలు ఎల్ల‌ప్పుడూ సుర‌క్షితంగా ఉండాలంటే.. వైద్య నిపుణులు చెప్పిన సూచ‌న‌లు..

Advertisement
Advertisement