Niranjan Reddy | ప్రజల తీర్పును కాలరాసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి క్లీన్‌చిట్ ఇస్తూ స్పీకర్ వెలువరించిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదని, కాంగ్రెస్ రాజ్యాంగమంటూ మండిపడ్డారు.
Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి క్లీన్‌చిట్ ఇస్తూ స్పీకర్ వెలువరించిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదని, కాంగ్రెస్ రాజ్యాంగమంటూ మండిపడ్డారు. స్పీకర్ తీర్పు కాంగ్రెస్ ద్వంద నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజల తీర్పును కాలరాసి ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందన్నారు.
కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌కు, కూతురును కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయించి కండువా వేసుకుని తిరిగి చేతి గుర్తుకు ఓటేయమని కోరిన కడియం శ్రీహరికి క్లీన్ చిట్ ఇవ్వడం కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. నిత్యం రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలును గాలికి వదిలేయడమే కాదు.. రాజ్యాంగాన్ని కూడా గాలికి వదిలేశాడని విమర్శించారు.
తెలంగాణ నిధుల దోపిడీకి ఇక్కడి అధికారాన్ని అడ్డు పెట్టుకున్నారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని, అందుకే ఇక్కడి పరిణామాలపై, ఇక్కడి ప్రభుత్వ అరాచకాలపై కాంగ్రెస్ అధిష్ఠానం నోరెత్తడం లేదని మండిపడ్డారు. దానం, కడియం శ్రీహరిల అనర్హత విషయంలో స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు.
సంబంధిత వార్తలు

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

Mahesh Kumar Goud | జనగణనలో కులగణన.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: పీసీసీ చీఫ్
మే 20, 2026

Niranjan Reddy | మేం కదిల్తేనే కాంగ్రెసోళ్లు కండ్లు తెరిచిండ్రు: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



