Xiaomi 17 | భారత్‌లో లాంచ్ అయిన షియోమీ 17 స్మార్ట్ ఫోన్.. పవర్‌ఫుల్ కెమెరాలు, భారీ బ్యాటరీ..
Xiaomi 17 | షియోమీ సంస్థ భారత్‌లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ షియోమీ 17ని విడుదల చేసింది. స్టాండర్డ్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా వచ్చిన ఈ ఫోన్ క్వాల్‌కామ్ తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 2025 సెప్టెంబర్‌లో చైనాలో విడుదల చేసినప్పుడు 7,000ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.
Technology | Published On Mar 11, 2026, 12.44 pm IST
Xiaomi 17 | షియోమీ సంస్థ భారత్‌లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ షియోమీ 17ని విడుదల చేసింది. స్టాండర్డ్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా వచ్చిన ఈ ఫోన్ క్వాల్‌కామ్ తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 2025 సెప్టెంబర్‌లో చైనాలో విడుదల చేసినప్పుడు 7,000ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అయితే గ్లోబల్ మార్కెట్లలో 6,300ఎంఏహెచ్ బ్యాటరీతో విడుదలైంది. భారతీయ వేరియంట్ కూడా గ్లోబల్ మోడల్‌లాగే అదే బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. ఈ ఫోన్ వైర్డ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ ను ఇస్తుంది. అలాగే లైకా భాగస్వామ్యంతో రూపొందించిన 50 మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ను ఫోన్‌కు వెనుక వైపు ఇచ్చారు.
ధర వివరాలు..
భారత్‌లో షియోమీ 17 ధర రూ.89,999 నుంచి ప్రారంభమవుతోంది. ఈ ధర 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది. ఇక 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.99,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్ రంగుల్లో లాంచ్ అయింది. మార్చి 13 నుంచి షియోమీ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఇతర ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.
అద్భుతమైన డిస్‌ప్లే..
ఫీచర్ల విషయానికి వస్తే షియోమీ 17లో 6.3 ఇంచుల క్రిస్టల్‌రెస్ ఓలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి 120హెడ్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను ఇస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. సూర్యకాంతిలోనూ స్పష్టంగా తెరను వీక్షించేలా గరిష్టంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా డిస్‌ప్లేకు ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఇచ్చారు. క్వాల్‌కామ్ ఏఐ ఇంజిన్ ఉంది కనుక ఏఐ ఫీచర్లను వేగంగా ఉపయోగించుకోవచ్చు. 16జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజ్‌ను ఇస్తున్నారు. ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా వేడికి గురి కాకుండా ఉండేందుకు గాను ఇందులో ప్రత్యేకంగా 3డీ ఐస్‌లూప్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా ఇచ్చారు.

పవర్‌ఫుల్ కెమెరాలు..
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమీ హైపర్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇవ్వగా, హైపర్ ఏఐ అనే కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు. దీని సహాయంతో ఏఐ ద్వారా పలు పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఏఐ రైటింగ్, ఏఐ స్పీచ్ రికగ్నిషన్, ఏఐ ఇంటర్‌ప్రిటర్, ఏఐ సెర్చ్, ఏఐ డైనమిక్ వాల్ పేపర్స్, గూగుల్ జెమిని ఆధారిత సర్కిల్ టు సెర్చ్ ఫీచర్లు ఈ ఏఐ ప్లాట్‌ఫామ్‌లో లభిస్తున్నాయి. షియోమీ 17 ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెపాసిటీ కలిగిన మూడు కెమెరాలను ఇచ్చారు. వీటిల్లో ఒకటి ప్రధాన కెమెరాగా పనిచేస్తుంది. ఇంకొకటి టెలిఫొటో లెన్స్‌గా, మరొకటి అల్ట్రా వైడ్ సెన్సార్‌గా పనిచేస్తుంది. ముందు వైపు కూడా 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ కెమెరాలన్నింటితోనూ 8కె వీడియోలను రికార్డు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
భారీ బ్యాటరీ..
కనెక్టివిటీ పరంగా షియోమీ 17 ఫోన్‌లో వైఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి ఫీచర్లను ఇచ్చారు. డాల్బీ అట్మోస్ ఫీచర్ ఉన్నందున ఫోన్ ఆడియో చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఏఐ ఆధారిత ఫేస్ అన్ లాక్ ఫీచర్లను ఈ ఫోన్‌లో ఇచ్చారు. ఈ ఫోన్‌లో 6300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా దీనికి 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. 50 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఉంది. ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సదుపాయాన్ని ఈ ఫోన్ కలిగి ఉంది.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



