Jaishankar | IRIS లావన్‌కు ఆశ్రయం కల్పించినందుకు భారత్‌కు ఇరాన్ కృతజ్ఞతలు : జైశంకర్
Jaishankar | ఇరాన్ నావికాదళానికి చెందిన ఐఆర్ఐఎస్ లావన్ (IRIS Lavan)కు కొచ్చి ఓడరేవు (Kochi port)లో ఆశ్రయం కల్పించినందుకు భారత్‌కు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (Jaishankar) తెలిపారు.
Jaishankar | మిడిల్ ఈస్ట్ (Middle East)లో యుద్ధ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇరాన్ యుద్ధంపై ఇవాళ రాజ్యసభలో (Rajya Sabha) జరిగిన చర్చ సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (Jaishankar) కీలక విషయాలను వెల్లడించారు. ఇరాన్ నావికా దళానికి చెందిన ఐఆర్ఐఎస్ డెనా (IRIS Dena) యుద్ధనౌకను అమెరికా సబ్ మెరైన్ టార్పెడోలతో ముంచేయడానికి కేవలం కొన్ని రోజుల ముందే, భారత్ మరో ఇరాన్ నౌకకు తన తీరంలో ఆశ్రయమిచ్చిన విషయం తెలిసిందే. 'IRIS లావన్'కు కొచ్చి ఓడరేవు (Kochi port)లో ఆశ్రయం కల్పించింది. ఈ సాయంపై ఇరాన్ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపినట్లు జైశంకర్ ఈ సందర్భంగా తెలిపారు.
IRIS లవన్ (IRIS Lavan) కు కొచ్చి ఓడరేవులో ఆశ్రయం కల్పించినందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారని రాజ్యసభకు వెల్లడించారు. మానవతా దృక్పథంతోనే ఇరాన్ నౌకను కొచ్చి ఓడరేవులో డాకింగ్‌కు అనుమతించినట్లు చెప్పారు. ఆ సమయంలో అది సరైన నిర్ణయం అని పార్లమెంట్‌కు తెలిపారు. తమ మూడు నౌకలను భారత ఓడరేవుల్లో నిలిపుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇరాన్ ఫిబ్రవరి 28న అభ్యర్థించినట్లు చెప్పారు. భారత్ మార్చి 1న అనుమతి మంజూరు చేసిందన్నారు. దీంతో దాదాపు 183 మంది నావికులతో కూడిన IRIS లవన్ మార్చి 4న కొచ్చికి చేరుకుందని చెప్పారు. వారందరికీ భారత నౌకాదళ వసతులతో ఆశ్రయం కల్పించినట్లు జైశంకర్ వివరించారు.
భారత్ సాహసోపేత నిర్ణయం..
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నావికాదళానికి చెందిన ఐఆర్ఐఎస్ లావన్ (IRIS Lavan) అనే నౌక విశాఖపట్నంలో జరిగిన ఐఎఫ్ఆర్ వేడుకల అనంతరం తిరుగు ప్రయాణమైంది. అదే సమయంలో ఈ నౌకలో తీవ్ర సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ ప్రభుత్వం భారత్‌ను సంప్రదించి, అత్యవసరంగా తమ నౌకను కొచ్చి పోర్ట్‌లో నిలిపేందుకు అనుమతి కోరింది. సరిగ్గా అదే రోజున అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై సంయుక్త దాడులు ప్రారంభించడం గమనార్హం. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న భారత ప్రభుత్వం, మార్చి 1వ తేదీన అనుమతులు మంజూరు చేసింది. దీనిప్రకారం, మార్చి 4న ఐఆర్ఐఎస్ లావన్ సురక్షితంగా కొచ్చి చేరుకుంది. ప్రస్తుతం ఈ నౌకలోని 183 మంది సిబ్బందికి భారత నావికాదళం కొచ్చిలోని తమ ఫెసిలిటీస్‌లో వసతి కల్పించింది. అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఆపదలో ఉన్న నౌకకు ఆశ్రయమిచ్చి భారత్ తన తటస్థ, మానవతా వైఖరిని చాటుకుంది.
ఐఆర్ఐఎస్ డెనా మునక
ఇరాన్ ఫ్రిగేట్ 'ఐఆర్ఐఎస్ డెనా'కు మాత్రం అదృష్టం కలిసి రాలేదు. మార్చి 4వ తేదీ తెల్లవారుజామున, శ్రీలంకలోని గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తుండగా, అమెరికాకు చెందిన ఒక అణు సబ్ మెరైన్ ప్రయోగించిన టార్పెడో దాడిలో ఈ నౌక పేలిపోయింది. ఈ దాడి ఎంత వేగంగా జరిగిందంటే, నౌక నుండి డిస్ట్రెస్ సిగ్నల్ (సహాయం కోరుతూ వచ్చే సంకేతం) అందిన కొద్దిసేపటికే అది సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 80 మందికి పైగా ఇరాన్ నావికులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంక నౌకాదళం 32 మందిని ప్రాణాలతో కాపాడగా, 87 మృతదేహాలను వెలికితీసింది.
Also Read..
Gold And Silver Prices Today | యుద్ధం తీవ్రతరం అయినా.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
Anand Mahindra | అతిథి దేవో భవ.. యుద్ధం వేళ ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






