Rajya Sabha | బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
Rajya Sabha | బెంగాల్‌లో ముగ్గురు తృణమూల్ (TMC) నేతల రాజీనామాతో ఖాళీ ఏర్పడిన మూడు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. జులై 24న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.
Rajya Sabha | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని మూడు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ (Election Commission) సోమవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జులై 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు జులై 14 వరకూ గడువు ఇచ్చారు. జులై 15న నామినేషన్ల పరిశీలన, జులై 17 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.
జులై 24న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నట్లు ఈసీ వెల్లడించింది. జులై 27లోపు ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఈసీ తన నోటిఫికేషన్‌లో తెలిపింది. కాగా, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాష్ చిక్ బరాయిక్ తమ పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక ఈ ఎన్నికల ద్వారా నూతనంగా ఎంపికయ్యే ఎంపీలు 2029 ఆగస్టు నుంచి 2030 ఏప్రిల్ వరకు సభ్యులుగా కొనసాగుతారు.
Election Commission announces bye-election to three Rajya Sabha seats in West Bengal.
Date of poll and counting of votes will be done on 24th July. pic.twitter.com/a9Q2PHjYyh
— ANI (@ANI) July 6, 2026
Also Read..
ఒకే సినిమాకు ఆరుగురు డైరెక్టర్లు - మమితా బైజు హీరోయిన్ - నిర్మాతగా కోలీవుడ్ స్టార్
మూడు రోజుల్లో 56 వేల మంది దర్శనం.. 90% కరిగిపోయిన మంచు లింగం..!
సంబంధిత వార్తలు

Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ వద్దిరాజు.. నియమించిన కేసీఆర్
జులై 9, 2026

ED Freezes TMC Bank Accounts | తృణమూల్ కాంగ్రెస్కు ఈడీ బిగ్ షాక్.. రూ.440 కోట్ల ఖాతాలు ఫ్రీజ్, ఆ హెలికాప్టర్ కొనుగోళ్లే కొంపముంచాయా?
జులై 8, 2026

Encounter | 11 ఏళ్ల బాలికపై హత్యాచారం.. ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం
జులై 8, 2026
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



