త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి మల్లికార్జున ఖర్గే గుర్తింపు

Mallikarjun Kharge | రాజ్యసభలో ప్ర‌తిప‌క్ష నేత‌గా (Leader Of Opposition In Rajya Sabha) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మ‌రోసారి గుర్తింపు పొందారు. రాజ్య‌స‌భ‌కు తిరిగి ఎన్నికైన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తిరిగి నియమితులయ్యారు.

D

National | Published On Jun 29, 2026, 6.07 pm IST

Mallikarjun Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి మల్లికార్జున ఖర్గే గుర్తింపు
Advertisement

Mallikarjun Kharge | రాజ్యసభలో ప్ర‌తిప‌క్ష నేత‌గా (Leader Of Opposition In Rajya Sabha) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మ‌రోసారి గుర్తింపు పొందారు. రాజ్య‌స‌భ‌కు తిరిగి ఎన్నికైన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తిరిగి నియమితులయ్యారు. ఖ‌ర్గే ప‌ద‌వీ కాలం ఈనెల 25తో ముగిసింది. ఇటీవలే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయ‌న తిరిగి ఎగువ స‌భ‌కు ఎన్నికయ్యారు. సోమవారం రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో సభ్యుడిగా ఖ‌ర్గే ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ (C P Radhakrishnan).. ఖర్గేని ప్రతిపక్ష నేతగా గుర్తించారు. ఈనెల 26నుంచి ప్రతిపక్ష నేతగా ఆయన నియామకం అమల్లోకి వస్తుందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ బులెటిన్ విడుదల చేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం 1977లోని సెక్షన్ 2 నిబంధనలకు అనుగుణంగా జూన్ 26 నుంచి అన్ని ప్ర‌యోజ‌నాలు అమ‌ల్లోకి వ‌చ్చేలా ఖ‌ర్గేని రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా చైర్మ‌న్ గుర్తించిన‌ట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement