Rajya Sabha | హింస దేనికీ పరిష్కారం కాదు.. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులపై రాజ్యసభలో కేంద్రం ప్రకటన
Rajya Sabha | ఇరాన్ యుద్ధం (Iran war) తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో (Middle East ) నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సంక్షోభం నుంచి బయటపడేందుకు చర్చలు, దౌత్యం మాత్రమే ఏకైక మార్గమని స్పష్టం చేసింది.
Rajya Sabha | ఇరాన్ యుద్ధం (Iran war) తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో (Middle East ) నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సంక్షోభం నుంచి బయటపడేందుకు చర్చలు, దౌత్యం మాత్రమే ఏకైక మార్గమని స్పష్టం చేసింది. యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఇరాన్‌లోని భారతీయుల భద్రతకు ఎంబసీ అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది. పరిస్థితులు చక్కబడగానే టెహ్రాన్‌లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని ప్రకటించింది. అంతేకాదు, యుద్ధం కారణంగా గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే ఉద్రిక్తతలు తగ్గుతాయని పునరుద్ఘాటించింది.
చర్చలు, దౌత్యమే సరైన మార్గం..
ఈ మేరకు రాజ్యసభ (Rajya Sabha)లో కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ (Jaishankar) ప్రకటన చేశారు. అయితే, ఆ సమయంలో కేంద్ర మంత్రి ప్రసంగానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. ముందుగా విపక్షాలకు అనుమతి ఇవ్వాలని కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు. వారి ఆందోళనలతో సభలో గందరగోళం నెలకొంది. వారి ఆందోళనల మధ్యే జైశంకర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. "ఫిబ్రవరి 28న ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అందరూ సంయమనం పాటించాలని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గాలని మా ప్రభుత్వం ఇప్పటికీ నమ్ముతోంది" అని జై శంకర్ అన్నారు.
గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు..
గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు ఉన్నారని.. వారి భద్రత పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్నారు. భారతీయుల భద్రతే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులకు ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు (Advisories) జారీ చేసిందని తెలిపారు. టెహ్రాన్‌పై జరుగుతున్న దాడులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు, గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని జై శంకర్ స్పష్టం చేశారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తోందన్నారు. అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులకు సాయం అందిస్తోందని వివరించారు. ఇప్పటికే పలువురు విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.
భారతీయుల రక్షణపై సీసీఎస్ ఆందోళన
జోర్దాన్, ఖతార్ వంటి దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించారు. "పరిస్థితుల తీవ్రత దృష్ట్యా మార్చి 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఇరాన్‌పై జరిగిన వైమానిక దాడులు, దాని పర్యవసానంగా పలు గల్ఫ్ దేశాల్లో జరిగిన దాడుల గురించి కమిటీకి వివరించాం. ఆ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయుల భద్రత, రక్షణపై సీసీఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రత, ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలపై చూపే ప్రభావంపై కూడా ఈ సమాశంలో చర్చించాం" అని జైశంకర్ స్పష్టం చేశారు.
అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం..
ఇంధన సరఫరాపై కూడా జైశంకర్ ప్రస్తావించారు. ఈ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఘర్షణలు తీవ్రతరమయ్యాయని చెప్పారు. దీని వల్ల ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. మారుతున్న పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ, సరఫరా గొలుసులపై పడే ప్రభావాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు వివరించారు. హింస దేనికీ పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. శాంతి స్థాపన కోసం భారత్ తన వంతు దౌత్య ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. అంతర్జాతీయ మానవతా చట్టాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని ఈ సందర్భంగా జైశంకర్ పేర్కొన్నారు.
Also Read..
Anand Mahindra | అతిథి దేవో భవ.. యుద్ధం వేళ ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్
Team India | టీ20 ప్రపంచ కప్ ట్రోఫీతో హనుమాన్ ఆలయాన్ని దర్శించిన టీమిండియా
Rs 1 Lakh Rent For 2 BHK | ముంబైలో 2 BHK నెల అద్దె రూ.లక్ష.. నెట్టింట విపరీతంగా చర్చ
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






