Gold And Silver Prices Today | యుద్ధం తీవ్రతరం అయినా.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
Gold And Silver Prices Today | ఓ వైపు పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం పెరగడం లేదు. యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. కానీ ఆయా లోహాల ధరల్లో పెరుగుదల కనిపించడం లేదు.
Gold And Silver Prices Today | ఓ వైపు పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం పెరగడం లేదు. యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. కానీ ఆయా లోహాల ధరల్లో పెరుగుదల కనిపించడం లేదు. సోమవారం కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే యుద్ధం మరింత తీవ్రతరం అయితే వీటి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇటీవలి కాలంలో ఈ లోహాల ధరలు గరిష్ట స్థాయిలను తాకాయి. కనుక పెట్టుబడిదారుల్లో ధర అధికంగా ఉందన్న భావన ఉందని, కాస్త తగ్గిన తరువాత మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక సోమవారం బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం, వెండి ధరలు..
గత వారం ముగింపుతో పోలిస్తే 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ.19,600 తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ.16,16,800గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,680 ఉండగా, 8 గ్రాముల బంగారం ధర రూ.1,29,344గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.16,168గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల ధర రూ.18వేలు తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ.14.82 లక్షలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,48,200 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,18,560గా ఉంది. 1 గ్రాము ధర రూ.14,820గా ఉంది. అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం 100 గ్రాముల ధర రూ.14,700 తగ్గింది. దీని ధర ప్రస్తుతం రూ.12,12,600గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,21,260 ఉండగా, 8 గ్రాముల ధర రూ.97,008, 1 గ్రాము ధర రూ.12,126గా ఉంది. కాగా వెండి ధరలు సైతం స్వల్పంగా తగ్గాయి. వెండి కిలో రూ.2,80,000 ఉండగా, తులం ధర రూ.2,800గా ఉంది.
ఎంసీఎక్స్‌లో ఎలా..
ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్టు ధరలో 0.42 శాతం మేర తగ్గుదల చోటు చేసుకుంది. 634 పాయింట్ల మేర తగ్గింది. ప్రస్తుతం 1,61,059 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో 1.22 శాతం ధర తగ్గింది. 3284 పాయింట్ల తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం 2,65,100 వద్ద కొనసాగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో అనిశ్చితి..
జులై 6, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు మంచి సమయం..
జులై 4, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పెట్టుబడిదారుల జోరు.. ఒక్క రోజులోనే రూ.32వేలు పెరిగిన పసిడి ధర..
జులై 3, 2026
తాజావార్తలు
- ●Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!
- ●Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!

Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్



