Anand Mahindra | అతిథి దేవో భవ.. యుద్ధం వేళ ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్
Anand Mahindra | ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మండే మోటివేషన్ షేర్ చేశారు. ఇందులో యుద్ధం కారణంగా దుబాయ్ (Dubai)లో చిక్కుకుపోయిన భారతీయులకు సాయం చేసిన ధీరజ్ జైన్ అనే భారతీయ వ్యాపారవేత్తను కొనియాడుతూ ఓ ట్వీట్ పెట్టారు.
Anand Mahindra | ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ స్ఫూర్తినిచ్చే వీడియోలను షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా వారాన్ని ఉత్సాహంగా మొదలు పెట్టేందుకు ప్రతీ సోమవారం స్ఫూర్తిదాయక సందేశాలను పంచుకుంటూ ఉంటారు. వృద్ధులు, అసాధారణ ప్రతిభ చూపినవారి గురించి, మానవీయ కోణం ఉన్న కథలకు ఆయన ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ రోజు కూడా ఆయన ఓ మండే మోటివేషన్ షేర్ చేశారు. ఇందులో యుద్ధం కారణంగా దుబాయ్ (Dubai)లో చిక్కుకుపోయిన భారతీయులకు సాయం చేసిన ధీరజ్ జైన్ అనే భారతీయ వ్యాపారవేత్తను కొనియాడుతూ ఓ ట్వీట్ పెట్టారు.
ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో (Middle East) ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో వేలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. దీంతో విమానాల రద్దు వల్ల దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారతీయ కుటుంబాల కోసం ధీరజ్ జైన్ (Dhiraj Jain) తన ఫామ్‌హౌస్‌లో బస కల్పించిన విషయాన్ని ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో షేర్ చేశారు. మన భారతీయ సంస్కృతిలోని అతిథి దేవో భవ (Atithi Devo Bhava) అనే గొప్ప భావం మనం ఎక్కడికి వెళ్లినా మనతోనే ఉంటుందని చెప్పేందుకు ఈ ఘటన ఓ నిదర్శనం అని పేర్కొన్నారు. కొన్నిసార్లు ఓ వక్తి చూపించే చిన్న చొరవ.. మనకు ఎదుటివారిపై ఉన్న నమ్మకాన్ని పెంచుతుందని మహీంద్రా తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ మేరకు భారతీయులు అక్కడ ఆశ్రయం పొందుతున్న వీడియోని షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
గతనెల చివరిలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దాడులతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమన్నది. ఈ యుద్ధం గల్ఫ్ దేశాలకు కూడా వ్యాపించింది. దీంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఫలితంగా వందలాది మంది భారతీయులు దిక్కుతోచని స్థితిలో అక్కడ చిక్కుకుపోయారు. దుబాయ్‌లో హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. దీంతో తలదాచుకునేందుకు గదులు దొరకడం అక్కడ గగనమైపోయింది. చాలా మంది ఆశ్రయం లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే బిక్కుబిక్కు మంటూ ఎటూ వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇక రాజస్థాన్‌కు చెందిన ధీరజ్ జైన్ 11 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితి తెలుసుకున్న అతను తన ఫామ్‌హౌస్‌లో వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. సుమారు 200 మందికిపైగా భారతీయులు అక్కడ తలదాచుకుంటున్నారు. వారందరికి ధీరజ్ జైన్ ఆహారం, వైద్యం అందిస్తున్నారు. దుబాయ్ వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న వారికోసం స్వయంగా ధీరజే వాహనాలను కూడా పంపుతుండటం విశేషం.
https://x.com/anandmahindra/status/2030847788515291181
Also Read..
Rs 1 Lakh Rent For 2 BHK | ముంబైలో 2 BHK నెల అద్దె రూ.లక్ష.. నెట్టింట విపరీతంగా చర్చ
Budget session | నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ
Indian Rupee | మరింత బలహీన పడిన రూపాయి.. ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుందా..?
సంబంధిత వార్తలు

PM Modi | 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించింది : ప్రధాని మోదీ
జులై 4, 2026

Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర ప్రమాదం: ‘అరామ్కో’ హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం
జూన్ 28, 2026

Anand Mahindra | వృద్ధ కళాకారుడికి అండగా నిలిచి.. ఔదార్యత చాటుకున్న ఆనంద్ మహీంద్రా
జూన్ 25, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



