UNHRC | పెంచిన భూతమే కాటేస్తోంది.. సింధు జలాల ఒప్పందానికి కాలం చెల్లింది.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
UNHRC | ఐక్యరాజ్యసమితి వేదికగా దాయాది పాకిస్థాన్ (Pakistan)పై భారత్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకపడింది. జమ్ము కశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. "ఇంకా పరిష్కారం కాని ఏకైక అంశం ఏదైనా ఉందంటే.. భారత భూభాగాలను పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకోవడం, వాటిని తిరిగి అప్పగించకపోవడమే" అని పేర్కొంది.
UNHRC | ఐక్యరాజ్యసమితి వేదికగా దాయాది పాకిస్థాన్ (Pakistan)పై భారత్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకపడింది. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా పెంచి పోషిస్తూ.. ఇప్పుడు తన సొంత చర్యల ఫలితాలను అనుభవిస్తున్న పాకిస్థాన్‌ను ఒక "ఫ్రాంకెన్‌స్టైన్ దేశం"గా (Frankenstein state) న్యూఢిల్లీ అభివర్ణించింది. తాము ఉగ్రవాద బాధితులమని ఇస్లామాబాద్ చెప్పుకోవడాన్ని భారత్ తీవ్రంగా ప్రశ్నించింది. అంతేకాదు, భారత్-పాక్ మధ్య దశాబ్దాల క్రితం కుదిరిని సింధూ జలాల ఒప్పందానికి (indus water treaty) కాలం చెల్లిందని స్పష్టం చేసింది.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దుష్ప్రచారం..
గురువారం జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి జమ్ము కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనికి ఐరాసలో భారత ప్రతినిధి అనుపమ సింగ్ గట్టిగా బదులిచ్చారు. జమ్ము కశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. "ఇంకా పరిష్కారం కాని ఏకైక అంశం ఏదైనా ఉందంటే.. భారత భూభాగాలను పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకోవడం, వాటిని తిరిగి అప్పగించకపోవడమే" అని ఆమె అన్నారు. కశ్మీర్‌పై పాక్ చేసే దుష్ప్రచారం కేవలం తమ వైఫల్యాలను, అంతర్గత ఆర్థిక సంక్షోభాన్ని కప్పిపుచ్చుకునేందుకేనని నొక్కి చెప్పారు. భారత భూభాగాలపై హక్కులు కోరడం మానేసి, పాకిస్థాన్ మొదట తన సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని అనుపమ సింగ్ చురకలంటించారు.
వారు పెంచిన భూతమే ఇప్పుడు కాటేస్తోంది..
"ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ విధానమని అక్కడి రక్షణ మంత్రి స్వయంగా గొప్పలు చెబుతున్నారు. అయినప్పటికీ పాకిస్థాన్ తనను తాను ఉగ్రవాద బాధితురాలిగా పేర్కొనడం హాస్యాస్పదం. ఇది ఒక ఫ్రాంకెన్‌స్టైన్ దేశానికి సజీవ సాక్ష్యం. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారు పెంచిన ఉగ్రవాద భూతమే ఇప్పుడు తిరిగి ఆ దేశాన్నే కాటేస్తోంది" అని అనుపమ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా, గతంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ గత మూడు దశాబ్దాలకు పైగా ఉగ్రవాద సంస్థలకు మద్దతు, శిక్షణ ఇచ్చిందని, నిధులు కూడా సమకూర్చినట్లు బహిరంగంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ఉద్దేశించి ఇప్పుడు అనుపమ సింగ్ దాయాదికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పాక్ దారుణాలకు నిలువెత్తు సాక్ష్యం..
ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇటీవలే చోటు చేసుకున్న ఉద్రిక్తతలను కూడా అనుమప సింగ్ ప్రస్తావించారు. పీవోకేలోని రావాలాకోట్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని ఐరాస దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలే అక్కడ జరిగిన విషాదం.. పాక్ దారుణాలకు నిలువెత్తు సాక్ష్యం అని తెలిపారు. "ఆహారం కోసం చేసిన డిమాండ్లకు.. బుల్లెట్లు, క్రూరత్వమే సమాధానంగా లభించాయి" అని వ్యాఖ్యానించారు. అక్కడ జరుగుతున్న పౌరుల హత్యలు, పీవోకే వ్యాప్తంగా సాగుతున్న క్రూరమైన అణచివేత ఊహించదగిన ఫలితాలేనని వ్యాఖ్యానించారు. ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు, ఆర్థిక ఇబ్బందులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పీవోకే వ్యాప్తంగా ఈ నెల ఆరంభంలో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనలపై పాక్ సైన్యం ఉక్కుపాదం కారణంగా 16 మంది మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు.
ఆ ఒప్పందానికి కాలం చెల్లింది..
గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో భారత్ రద్దు చేసుకున్న సింధూ జలాల ఒప్పందం గురించి కూడా అనుపమ ప్రస్తావించారు. ఆరు దశాబ్దాల క్రితం కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రస్తుత కాలానికి ఏమాత్రం సరిపోదని.. దానికి ఇప్పుడు కాలం చెల్లిపోయిందని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ లాంటి దేశం స్నేహపూర్వక సంబంధాల ప్రాతిపదికన కుదిరిన ఒప్పందాల ద్వారా ప్రయోజనాలను పొందడానికి అర్హత లేదని తేల్చి చెప్పారు. సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి స్పష్టంగా ఉందని ఈ సందర్భంగా అనుపమ సింగ్ స్పష్టం చేశారు.
Also Read..
మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
నీట్ రీ-ఎగ్జామ్‌కు లైన్ క్లియర్.. ఆ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు
సంబంధిత వార్తలు

Maharashtra Teachers Arrest | పాఠశాలలో పాకిస్థానీ పాట.. ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లపై కేసు
జూన్ 19, 2026

Paraquat | పారాక్వాట్ గడ్డి మందుపై వైద్యుల ఆందోళన.. పూర్తిగా నిషేధించాల్సిందే అంటున్న నిపుణులు..
జూన్ 19, 2026

India In G7 | సభ్యదేశం కాదు.. అయినా భారత్‌కు రెడ్ కార్పెట్ పరుస్తున్న జీ7 దేశాలు.. న్యూఢిల్లీకి ఎందుకంత ప్రాధాన్యం..?
జూన్ 18, 2026
తాజావార్తలు
- ●Qatar vs Canada | జోనాదన్ తీన్మార్
- ●Jio AI | జియో ఏఐ విప్లవం.. ఒక్క వాయిస్ కమాండ్ తో అనేక పనులు..
- ●Folk Dancer | హీరోయిన్గా తెలుగు ఫోక్ డ్యాన్సర్ - సుకుమార్ సినిమాలో ఛాన్స్
- ●Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ
- ●Dasoju Sravan | హిల్ట్ పేరుతో రూ.6 లక్షల కోట్ల దందా చేస్తున్నరు.. మేం ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం
- ●Stock Markets | భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. యాక్సెంచర్ హెచ్చరికలతో ఐటీ షేర్లు ఢమాల్..

Qatar vs Canada | జోనాదన్ తీన్మార్

Jio AI | జియో ఏఐ విప్లవం.. ఒక్క వాయిస్ కమాండ్ తో అనేక పనులు..

Folk Dancer | హీరోయిన్గా తెలుగు ఫోక్ డ్యాన్సర్ - సుకుమార్ సినిమాలో ఛాన్స్

Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ



